Skip to main content

వెబ్-ఆధారిత మరియు మొబైల్ అప్లికేషన్ ప్లాట్ఫాం గోప్యతా విధానం

చివరగా నవీకరించబడింది  2021, మే 25

పరిచయం

Science 37, ఇంక్. ("Science 37," "మేము," లేదా "మేము") మీ సమాచారాన్ని రక్షించడానికి కట్టుబడి ఉంది. ఆ మేరకు, Science 37 యొక్క వెబ్ ఆధారిత మరియు/లేదా మొబైల్ అప్లికేషన్ ఫ్లాట్ ఫారం ("ఫ్లాట్ ఫారం")పై మీ సమాచారాన్ని మేం ఎలా ప్రాసెస్ చేస్తాం అనే దాని గురించి మీరు తెలుసుకోవాలని మేం కోరుకుంటున్నాం,క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొనేందుకు మేం దీనిని మేము అందిస్తాము. ఈ Science 37 ప్లాట్ ఫారమ్ గోప్యతా విధానం ("గోప్యతా విధానం") Science 37 ఫ్లాట్ ఫారంతో మీ ఇంటరాక్షన్ ల సమయంలో మీరు అందించే సమాచారాన్ని ఎలా సేకరిస్తుంది, ఉపయోగిస్తుంది మరియు వెల్లడిస్తుంది. సమాచారాంతర సమ్మతి పత్రంలో ప్రాయోజితుడు వివరించిన సమాచారాన్నీ హ్యాండ్లింగ్ విధానాల నుండి ఇది వేరుగా ఉంటుంది.   

క్లినికల్ ట్రయల్లో భాగంగా ఏ వ్యక్తిగత సమాచారాన్ని సేకరించాలి, మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎలా ఉపయోగించాలి, ఎలా వెల్లడించాలి అనే అంశాలపై స్పాన్సర్ కీలక నిర్ణయాలు తీసుకుంటారు. క్లినికల్ ట్రయల్స్లో మీ వ్యక్తిగత సమాచార నిర్వహణ ఎలా జరుగుతుంది, మీ సమాచారాన్ని రక్షణ చట్టాలు, క్లినికల్ ట్రయల్ విషయంలో ఏవైనా ప్రశ్నలుంటే ఎవరిని అడగాలి వంటి అంశాలపై మరింత సమాచారం కోసం, దయచేసి సంబంధిత సమాచారయుత సమ్మతి పత్రంలోని గోప్యత అనే  శాఖను చూడండి.

గోప్యతా విధానంలో ఉపయోగించిన విధంగా, "వ్యక్తిగత సమాచారం" అంటే ఒక నిర్దిష్టమైన సహజ వ్యక్తిని గుర్తించేందుకు, లేదా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా తగిన విధంగా లింక్ చేసేందుకు ఉపయోగించే ఏ సమాచారమైనా అవుతుంది.

మీ గురించి మేం సేకరించే సమాచారం

ప్లాట్ఫాం యూజర్ అకౌంట్లు సృష్టించడానికి స్పాన్సర్ అభ్యర్థన మేరకు మేం ఈ కింది వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తాం.

  • మీ పేరు, ఈమెయిల్ అడ్రస్
  • మీ భాషా ప్రాధాన్యత, టైమ్ జోన్

మీ వ్యక్తిగత సమాచారాన్ని మేం ఎలా సేకరిస్తాం

మీరు ప్లాట్ఫాంపైన ఫారాలను పూర్తిచేయగానే మేం మీ నుండి సమాచారాన్ని సేకరిస్తాం. మీరు మాతో ఉత్తర, ప్రత్యుత్తరాలు జరిపేటప్పుడు (ఉదాహరణకు, ఈమేయిల్ ద్వారా), మీరు ప్లాట్ఫాంలో ఉన్న ఏదైనా సమస్యపై నివేదిక చేసినప్పుడు కూడా మేం సమాచారాన్ని సేకరించవచ్చు. 

మీరు అభ్యర్థించిన ప్లాట్ఫాం సేవల్ని మీకు అందించటం కోసం మాకు వ్యక్తిగత సమాచారం అవసరం అవుతుంది. మీరు మేం కోరిన సమాచారాన్ని అందించకపోతే, ప్లాట్ఫాం సేవల్ని మేం అందించలేకపోవచ్చు. ఒకవేళ మీరు మాకు లేదా ప్లాట్ఫాంకు సంబంధించిన సర్వీస్ ప్రొవైడర్లకు ఇతర వ్యక్తుల గురించిన వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడించినట్టయితే, అలా చేసేందుకు మీరు అధికారాన్ని కలిగి ఉన్నారని, ఈ గోప్యతా విధానానికి కట్టుబడి ఆ సమాచారాన్ని వాడుకునేందుకు మీరు మాకు అనుమతిస్తున్నారని పరిగణిస్తాం.

వ్యక్తిగత సమాచారాన్ని మేం ఎలా వాడుకుంటాం, ఎలా వెల్లడిస్తాం

ఉపయోగం

క్లినికల్ ట్రయల్లో మీ భాగస్వామ్యంతో ముడిపడిన చట్టపరమైన, కాంట్రాక్చువల్, వ్యాపార ప్రయోజనాల కోసం మేం సేకరించే వ్యక్తిగత సమాచారాన్ని మేం ఉపయోగించుకుంటాం. ఉదాహరణకు, ఇందులో సేవా-సంబంధిత ప్రయోజనాల కోసం వ్యక్తిగత సమాచార సేకరణ (అంటే, మీ యూజర్ అనుభవాన్ని అనుకూలపర్చడం, ప్లాట్ఫాం సెక్యూరిటీని మెయింటేన్ చేయడం), సమ్మతి సహకారం (మీకు ఏ చట్టాలు లేదా నియంత్రణలు వర్తిస్తాయో మీ లొకేషన్ నిర్ధారించగలదు), భాషా ప్రాధాన్యతల అనుకూలీకరణ అందించడం.

ఈ కింద పేర్కొన్న ప్రయోజనాల కోసం మేం, మా సర్వీస్ ప్రొవైడర్లు వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగించుకుంటాం:

  • ప్లాట్ఫాం నిర్వాహకతను అందించటం, మీ అభ్యర్థనలను పరిపూర్తి చేయడం
  • మీకు ప్లాట్ఫాం నిర్వాహకతను అందించటం కోసం, అంటే మీ రిజిస్టర్డ్ అకౌంట్కు యాక్సెస్ ఏర్పాటు చేయడం, సంబంధిత వినియోగదారు సేవను మీకు అందిచటం.
  • మీరు మా ఆన్లైన్ కాంటాక్ట్ ఫారాల ద్వారా లేదా మరేదైనా విధంగా మమ్మల్ని కాంటాక్ట్ చేసినప్పుడు, మీ సందేహాలకు స్పందించటం, మీ అభ్యర్థనలను పరిపూర్తి చేయడం కోసం; ఉదాహరణకు మీరు మాకు ప్రశ్నలు, సలహాలు, ప్రశంసలు లేదా ఫిర్యాదులు పంపించినపుడు.
  • మీకు పరిపాలనాపరమైన సమాచారాన్ని అందించటం కోసం, అంటే ఉదాహరణకు మా నిబంధనలు, షరతుల్లో, విధానాల్లో వచ్చిన మార్పులు లేదా ప్లాట్ఫాంలో జరిగిన మార్పులు.

మీతో మా ఒప్పందసంబంధాన్ని నిర్వహించేందుకు, అలాగే/లేదా చట్టపరమైన బాధ్యతకు కట్టుబడి ఉండేందుకు మేం ఈ కార్యకలాపాల్లో పాలుపంచుకుంటాం.

 

  • మా వ్యాపార ప్రయోజనాలను పరిపూర్తి చేయడం.
  • ట్రబుల్షూటింగ్, సమాచారాన్ని విశ్లేషణ, సిస్టమ్ టెస్టింగ్ సహా ప్లాట్ఫాం భద్రతను నిర్వహించేందుకు, కాపాడేందుకు.
  • సమాచారాన్ని విశ్లేషణ కోసం; ఉదాహరణకు, ప్లాట్ఫాం వాడకం గురించి ట్రెండ్స్ను అంచనా వేయటానికి, ప్లాట్ఫాం సమర్థతను మెరుగుపర్చేందుకు.
  • ఆడిట్స్ కోసం, మా అంతర్గత ప్రక్రియలు కోరుకున్న విధంగా నడిచేలా పరిశీలించుకోవడం కోసం, అలాగే చట్టపరమైన, నియంత్రణాపరమైన లేదా ఒప్పందసంబంధ అవసరాలను పరిష్కరించుకునేందు కోసం.
  • అవినీతి నిరోధం, అవినీతి కట్టడి పర్యవేక్షణ ప్రయోజనాల కోసం; ఉదాహరణకు, సైబర్ దాడులను లేదా గుర్తింపు చౌర్యానికి పాల్పడే ప్రయత్నాలను పసిగట్టి, నివారించడం కోసం.
  • కొత్త ఉత్పత్తులను, సేవలను అభివృద్ధి చేయటం కోసం.
  • మా ప్రస్తుత ఉత్పత్తులను, సేవలను పెంపొందించేందుకు, మెరుగుపర్చేందుకు, మరమ్మతు చేసేందుకు, నిర్వహణ లేదా మార్పులు చేసేందుకు, అలాగే నాణ్యత, భద్రత హామీ చర్యలు చేపట్టేందుకు.

 

మీతో మా ఒప్పందసంబంధాన్ని నిర్వహించేందుకు, చట్టపరమైన బాధ్యతకు కట్టుబడి ఉండేందుకు, అలాగే/లేదా మా న్యాయమైన ప్రయోజనాల ఆధారంగా మేం ఈ కార్యకలాపాల్లో పాలుపంచుకుంటాం.

 

  •  వ్యక్తిగత సమాచారాన్ని కూర్చడం అలాగే/లేదా అనామకం చేయడం.
  • మేం వ్యక్తిగత సమాచారాన్ని కూర్చడం, అలాగే/లేదా అనామకం చేయడం ద్వారా దాన్ని ఇక ఏ మాత్రం వ్యక్తిగత సమాచారంగా పరిగణించలేకుండా చేయగలం. మా వినియోగం కోసం ఇతర సమాచారాన్నిను సృష్టించేందుకు మేం అలా చేస్తాం. అది ఇక మిమ్మల్ని లేదా మరే ఇతర వ్యక్తినీ గుర్తించదుకాబట్టి దాన్ని మేం మరేదైనా ప్రయోజనం కోసం ఉపయోగించగలం, వెల్లడి చేయగలం.  ఉదాహరణకు, ప్లాట్ఫాం యూజర్లు ప్లాట్ఫాంలోని ఒక నిర్దిష్ట ఫీచర్ని ఎలా ఉపయోగిస్తున్నారనే ట్రెండ్స్ని గుర్తించటం కోసం మేం మొత్తం సమాచారాన్ని వినియోగాన్ని కూర్చడం ద్వారా భవిష్యత్ మెరుగదల గురించిన సమాచారాన్ని వెల్లడించగలం.

 

ప్రకటన

థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్లు మాకు అందించే సేవల్లో సౌలభ్యం కోసం మేం వారికి వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడి చేయగలం. ఉదాహరణకు వెబ్సైట్ హోస్టింగ్, సమాచారాన్ని విశ్లేషణ, అవినీతిని నిరోధించడం, సమాాచార సాంకేతికత, తదితర మౌలిక సదుపాయాల ఏర్పాటు, వినియోగదారు సేవ, ఈమెయిల్ పంపిణీ, ఆడిటింగ్, ఇతర సేవలు వంటివి అందించే ప్రొవైడర్లు వీరిలో ఉండొచ్చు.

ఇతర వినియోగాలు, ప్రకటనలు

మీ వ్యక్తిగత సమాచారాన్ని అవసరమైన లేదా తగిన విధంగా, అలాగే మీ నిర్దిష్ట ఆమోదం లేకుండానే, ముఖ్యంగా అలా చేసేందుకు మాపైన చట్టపరమైన బాధ్యత లేదా న్యాయబద్ధమైన ప్రయోజనం ఏదైనా ఉన్నప్పుడు కూడా మేం ఉపయోగించుకుంటాం, వెల్లడి చేస్తాం. ఏవేవి అంటే:

  • ఒక కోర్టు ఆదేశం, చట్టం, రెగ్యులేషన్, లేదా చట్ట ప్రక్రియ, ప్రభుత్వానికి లేదా నియంత్రణకు సంబంధించిన అభ్యర్థనకు స్పందన, మీరు నివసించే దేశానికి అవతలి ప్రాంతాలకు సంబంధించిన చట్టాలు వంటి వాటికి బద్ధులమై ఉండటం కోసం.
  • ఒక అభ్యర్థనకు స్పందించటం లేదా మేం అవసరమైంది లేదా సరైంది అని భావించే సమాచారం అందించటం సహా ప్రజా, ప్రభుత్వ అధికారులతో (వారిలో మీరు నివసించే దేశానికి అవతలి ప్రాంతాల్లో ఉండే అధికారులు కూడా ఉండొచ్చు) సహకరించటం కోసం.
  • చట్టాన్ని అమలుచేసే అధికారులతో సహకరించటం కోసం, అంటే ఉదాహరణకు, చట్టాన్ని అమలు చేసే అధికారులు చేసే అభ్యర్థనలు, అదేశాలకు స్పందించటం లేదా మేం ముఖ్యమైందని భావించే సమాచారాన్ని అందించటం.
  • ఇతర చట్టపరమైన కారణాల కోసం, అంటే మా షరతులు, నిబంధనలు అమలు చేయటం లేదా మా హక్కులను, ప్రైవసీని, భద్రతను లేదా మా సంబంధితుల, మీ లేదా ఇతరుల ఆస్తిని కాపాడుకోవటం సహా.
  • ఒక అమ్మకం లేదా వ్యాపార లావాదేవీకి సంబంధించి, ఏదైనా పునర్వ్యవస్థీకరణ, విలీనం, అమ్మివేత, జాయింట్ వెంచర్, అసైన్మెంట్, బదిలీ లేదా మా వ్యాపారంలో, ఆస్తుల్లో లేదా స్టాక్లో (దివాలా లేదా అలాంటి ప్రక్రియలో భాగంగా కూడా) ఓ భాగాన్ని వదిలిపెట్టటం వంటివి జరిగినప్పుడు మీ వ్యక్తిగత సమాచారాన్ని థర్డ్ పార్టీకి వెల్లడించేందుకు లేదా బదిలీ చేసేందుకు మేం చట్టబద్ధమైన ప్రయోజనాన్ని కలిగి ఉంటాం.

ఇతర సమాచారం

ఇతర సమాచారం” అంటే మీ నిర్దిష్ట గుర్తింపును వెల్లడి చేయని లేదా మరే గుర్తించగల వ్యక్తితో నేరుగా సంబంధం లేని సమాచారం: ఈ ప్లాట్ఫాం ఇతర సమాచారం సేకరిస్తుంది, ఉదాహరణకు:

  • బ్రౌజర్, డివైస్ సమాచారం
  • యాప్ వాడకం సమాచారాన్ని
  • పిక్సెల్ ట్యాగ్స్, ఇతర టెక్నాలజీల ద్వారా సేకరించే సమాచారం
  • మీ నిర్దిష్ట గుర్తింపును ఏ మాత్రం వెల్లడి చేయని విధంగా కూర్చిన సమాచారం.

 

మేం ఇతర సమాచారాన్ని, వర్తించే చట్టం ప్రకారం మరో విధంగా చేయాల్సివస్తే తప్ప, ఉపయోగించుకోగలం, వెల్లడి చేయగలం. వర్తించే చట్టం ప్రకారం ఇతర సమాచారాన్ని మేం వ్యక్తిగత సమాచారంగా పరిగణించాల్సిన అవసరం ఏర్పడితే, మా గోప్యతా విధానంలో వివరించిన విధంగా వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగించే, వెల్లడి చేసే ప్రయోజనాలకు లోబడి మాత్రమే మేం దాన్ని ఉపయోగించుకుంటాం, వెల్లడి చేస్తాం.

వ్యక్తిగత సమాచార బదిలీ, నిల్వచేయగలం.

Science 37 ప్రధాన కార్యాలయం అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం, లాస్ ఏంజెలిస్లో ఉంది. మీ వ్యక్తిగత సమాచారాన్ని మా కేంద్రాలు ఉన్న లేదా సర్వీస్ ప్రొవైడర్లతో మేం కలిసి పనిచేసే ఏ దేశంలోనైనా నిల్వ చేయగలం. ఈ ప్లాట్ఫాంను ఉపయోగించటం ద్వారా, మీ సమాచారం మీరు నివసించే దేశానికి, అమెరికాకు అవతలి దేశాలకు బదిలీ అవుతుందని, అక్కడ మీ దేశానికి భిన్నమైన సమాచారాన్ని రక్షణ చట్టాలు ఉండవచ్చని మీరు అర్థం చేసుకున్నారు. కొన్ని నిశ్చితమైన పరిస్థితుల్లో, ఆ ఇతర దేశాల్లోని కోర్టులు, చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలు, నియంత్రణా సంస్థలు లేదా భద్రతా అధికారులు మీ వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్ చేసేందుకు అధికారాన్ని కలిగి ఉంటారు.

ఈఈఏకి సంబంధించిన అదనపు సమాచారం, స్విట్జర్లాండ్, యునైటెడ్ కింగ్డమ్

యూరోపియన్ కమిషన్ గుర్తించిన కొన్ని నాన్-ఈఈఏ దేశాలు, స్విట్జర్లాండ్, యునైటెడ్ కింగ్డమ్లు వారి ప్రమాణాల ప్రకారం సమాచారాన్ని రక్షణను సముచిత స్థాయిలో అందిస్తున్నాయి. (సముచిత రక్షణ అందించే దేశాల పూర్తి జాబితాను ఇక్కడ చూడొచ్చు). ఉదాహరణకు, ఈఈఏ, స్విట్జర్లాండ్, యూకేల నుంచి యూరోపియన్ కమిషన్ సముచితమైనవిగా పరిగణించని దేశాలకు బదిలీల కోసం, మేం మీ వ్యక్తిగత సమాచారాన్ని కాపాడటం కోసం యూరోపియన్ కమిషన్ స్వీకరించిన స్టాండర్డ్ కాంట్రాక్చువల్ క్లాజుల వంటి సముచిత చర్యలను నిర్ధారించాం. మీరు ఈ కింద ఇచ్చిన “మమ్మల్ని కాంటాక్ట్ చేయటం ఎలా” అనే సెక్షన్లో పేర్కొన్న విధంగా మమ్మల్ని కాంటాక్ట్ చేసి ఈ చర్యలకు సంబంధించిన కాపీని పొందవచ్చు.

మీ వ్యక్తిగత సమాచారం బదిలీ లేదా నిల్వ గురించి మీకు ఏవైనా గోప్యతా సంబంధిత ప్రశ్నలు ఉన్నట్లయితే, దయచేసి Privacy@Science37.com మమ్మల్ని సంప్రదించండి

 

సమాచారాన్ని సెక్యూరిటీ

మీరు మాతో పంచుకున్న వ్యక్తిగత సమాచారాన్ని రక్షించడానికి సెన్స్ 37 కట్టుబడి ఉంది. మీ వ్యక్తిగత సమాచారాన్ని అనధికారికంగా యాక్సెస్ చేయకుండా, వాడకుండా లేదా వెల్లడి చేయకుండా కాపాడేందుకు మేం తగిన సెక్యూరిటీ టెక్నాలజీలను, ప్రక్రియలను, సంస్థాగత చర్యలను జమిలిగా వాడాలని కోరుకుంటున్నాం. దురదృష్టవశాత్తు, సమాచారాన్ని ప్రసారం, నిల్వ వ్యవస్థలు 100 శాతం సురక్షితమైనవని చెప్పలేం. మాతో మీ ప్రతిస్పందన సురక్షితం కాదని నమ్మేందుకు మీకు ఏదైనా కారణం కనిపిస్తే, దయచేసి ఈ కింద ఇచ్చిన “మమ్మల్ని కాంటాక్ట్ చేయటం ఎలా” అనే సెక్షన్లో సూచించిన విధంగా మాకు తక్షణమే సమాచారం అందజేయండి.

 

సమాచారాన్నిను నిల్వ ఉంచడం

ఈ గోప్యతా విధానంలో పేర్కొన్న విధంగా, అలాగే/లేదా వర్తించే చట్టానికి అనుగుణంగా మీ వ్యక్తిగత సమాచారాన్ని దాన్ని ఏ ప్రయోజనం(నాల) కోసం సేకరించామో, దాని ప్రకారం అవసరమైనంత కాలం పాటు మా దగ్గర నిల్వ చేస్తాం. మేం దాన్ని నిల్వ ఉంచే కాలావధులను నిర్ధారించేందుకు ఉపయోగించే ప్రమాణాలు: 

  • మీతో కొనసాగుతున్న సంబంధం, ప్లాట్ఫాంతో మీరు కలిగి ఉండే సంబంధం ఎంత కాలం ఉంటుందో అంత కాలం. (ఉదాహరణకు, మీరు పాల్గొంటున్న అధ్యయనం ఎంత కాలం పాటు సాగుతుందో అంత కాలం);
  • మేం కట్టుబడి ఉన్న చట్టపరమైన బాధ్యతలు ఏవైనా ఉన్నట్టయితే; లేదా
  • మా చట్టపరమైన స్థితిని బట్టి నిల్వ ఉంచటం అవసరం అయినట్టయితే (ఉదాహరణకు, శాసన పరిమితులు, వ్యాజ్యం, లేదా నియంత్రణాపరమైన దర్యాప్తులు వంటివి). 

 

మీ హక్కులు

ఒకవేళ మీరు మీ వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్ చేసేందుకు, సవరించేందుకు, నవీకరించబడింది చేసేందుకు, లేదా డిలీట్ చేసేందుకు అభ్యర్థించాలనుకుంటే, వ్యక్తిగత సమాచారాన్ని ప్రాసెస్ చేయటంపైన అభ్యంతరం ఉంటే లేదా ఆప్ట్-ఔట్ కావాలనుకుంటే, లేదా మీరు మరేదైనా కంపెనీకి (వర్తించే చట్టం ప్రకారం మీకు లభించే హక్కులకు లోబడి మాత్రమే) అందజేసే ఉద్దేశంతో మీ వ్యక్తిగత సమాచారం కాపీ కావాలని అభ్యర్థించాలనుకుంటే, ఈ గోప్యతా విధానం చివరలో పేర్కొన్న కాంటాక్ట్ సమాచారాన్ని ఉపయోగించుకొని దయచేసి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. వర్తించే చట్టానికి అనుగుణంగా మేం మీ అభ్యర్థనకు స్పందిస్తాం. 

మీ అభ్యర్థనలో, మీరు ఏ వ్యక్తిగత సమాచారాన్ని మార్చాలని కోరుకుంటున్నారు లేదా మీ వ్యక్తిగత సమాచారాన్ని మా సమాచారాన్నిబేస్లో లేకుండా తొలగించాలని కోరుకుంటున్నారా అనే విషయాన్ని దయచేసి స్పష్టంగా తెలపండి. మీ రక్షణ కోసం, మాకు మీ అభ్యర్థనను పంపించేందుకు మీరు వాడే నిర్దిష్టమైన ఈమెయిల్తో ముడిపడిన వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన అభ్యర్థనలను మాత్రమే మేం అమలు చేయగలం. అలాగే, మీ అభ్యర్థనను అమలు చేయడానికి ముందు మీ గుర్తింపును ధ్రువీకరించుకోవాల్సిన అవసరం కూడా ఉండొచ్చు. ఆచరణలో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మేం మీ అభ్యర్థనను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాం.

రికార్డ్ కీపింగ్ అవసరాల కోసం, అలాగే/లేదా మార్పు కోసం లేదా డిలీట్ చేయడం కోసం అభ్యర్థించడానికి ముందు మీరు ఏవైనా లావాదేవీలు ప్రారంభించినట్టయితే, నిశ్చితమైన కొంత సమాచారాన్ని మేం నిల్వ చేయాల్సి రావచ్చనే విషయాన్ని దయచేసి దృష్టిలో ఉంచుకోండి.  

మీరు ఏదైనా క్లినికల్ ట్రయల్ నుంచి ఉపసంహరించుకుంటే లేదా ఉపసంహరించబడితే, మేం ప్లాట్ఫాం నుంచి ఎలాంటి కొత్త సమాచారాన్ని సేకరించడం లేదా మాకు లభించదు. అయితే, మీ ఉపసంహరణ అభ్యర్థన మాకు అందే లోపు, దాన్ని ప్రాసెస్ చేసే లోపు మేం సేకరించిన, ప్రాసెస్ చేసిన, నిల్వ చేసిన సమాచారాన్ని మేం డిలీట్ చేయలేకపోవచ్చు. దాన్ని క్లినికల్ ట్రయల్ ఉద్దేశాల కోసం, నియంత్రణా అవసరాలకు అనుగుణంగా - వర్తించే చట్టాలు దానికి భిన్నంగా నిర్దేశిస్తే తప్ప - ఉపయోగిస్తూనే ఉండొచ్చు.

గోప్యతా విధానానికి మార్పులు

మేం ఈ ప్లాట్ఫాంకు మార్పులు చేయొచ్చు. దాని ఫలితంగా, ఆ మార్పులు ప్రతిఫలించేలా ఈ గోప్యతా విధానాన్ని సంస్కరించాల్సిన అవసరం రావచ్చు. ఈ గోప్యతా విధానానికి జరిగే అలాంటి మార్పులన్నింటినీ మేం మా వెబ్సైట్లో ప్రచురిస్తాం. కాబట్టి ఈ పేజీని మీరు తరచూ సమీక్షిస్తూ ఉండాలి. సంస్కరించిన గోప్యతా విధానాన్ని మా వెబ్సైట్లో ప్రచురించినప్పుడే జరిగిన మార్పులేవైనా అమలులోకి వస్తాయి.

మమ్మల్ని కాంటాక్ట్ చేయటం ఎలా

Science 37, Inc.

జెన్ డేవిస్, డిప్యూటీ జనరల్ కౌన్సెల్, ప్రైవసీ ఆఫీసర్

Privacy@Science37.com 

600 కార్పొరేట్ పాయింట్ #320

కల్వర్ సిటీ, కాలిఫోర్నియా 90230

 

ఈఈఏ, యూకేకి సంబంధించిన అదనపు సమాచారం

మీరు

  • మా సమాచారాన్ని ప్రొటెక్షన్ ఆఫీసర్ (డీపీఓ)ని కూడా ఈ ఈమెయిల్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు Privacy@Science37.com  
  • మీరు మీరు నివసించే లేదా పని చేసే లేదా వర్తించే సమాచారాన్ని రక్షణ చట్ట ఉల్లంఘన జరిగిందనే అరోపణ వచ్చిన దేశానికి లేదా ప్రాంతానికి చెందిన ఏ పర్యవేక్షక అధికారికైనా మీరు నేరుగా ఫిర్యాదు చేయొచ్చు. సమాచారాన్ని రక్షణ అధికారుల జాబితాను ఈ లింకులో చూడొచ్చు http://ec.europa.eu/newsroom/article29/item-detail.cfm?item_id=612080.