Skip to main content

 

Science 37 వెబ్ ఆధారిత మరియు మొబైల్ అప్లికేషన్ ఫ్లాట్ ఫారం నియమనిబంధనలు

Science 37 యొక్క వెబ్ ఆధారిత లేదా మొబైల్ అప్లికేషన్ ఫ్లాట్‌ఫారంను వినియోగం ద్వారా మీరు ఈ నియమనిబంధనలను ఆమోదించినట్లుగా పరిగణించబడుతుంది. క్లినికల్ ట్రయల్‌లో మీరు పాల్గొనేందుకు అవకాశం కల్పించడం కొరకు Science 37 యొక్క వెబ్ ఆధారిత మరియు/లేదా మొబైల్ అప్లికేషన్ ఫ్లాట్‌ఫారం యాక్సెస్ మీకు కల్పించబడుతుంది. ఈ నియమనిబంధనలను మరీ ముఖ్యంగా వారెంటీల అస్వీకారం, లైసెన్స్ పరిమితులు, మీ ప్రాతినిధ్యాలు మరియు వారెంటీలు, బాధ్యత పరిమితి, నష్టపరిహారం మరియు పరిపాలించే చట్టానికి సంబంధించిన విభాగాలను జాగ్రత్తగా చదవండి, అవి మీ దృష్టిని ఆకర్షించడానికి క్యాపిటల్ అక్షరాల్లో, అండర్ లైన్ చేయబడి, లేదా బోల్డ్ చేయబడి ఉంటాయి. ఈ నియమనిబంధనలను తిరస్కరించడం ద్వారా ఆ ట్రయల్‌లో పాల్గొనేందుకు మీ అర్హతను ప్రభావితం కావచ్చు.

మేం ఎవరం మరియు ఈ ఒప్పందం గురించి

Science 37, Inc. (సమిష్టిగా “Science 37”, “మేం” లేదా “మమ్ములను”గా పేర్కొనబడుతుంది) మీకు తన Science 37 వెబ్ ఆధారిత మరియు/లేదా మొబైల్ అప్లికేషన్ ఫ్లాట్‌ఫారం (''ఫ్లాట్‌ఫారం’’)కు లైసెన్స్ ఇవ్వడం ద్వారా క్లినికల్ ట్రయల్‌లో పాల్గొనేందుకు మీకు అవకాశం కల్పిస్తుంది. మీరు ఆసక్తి వ్యక్తీకరించిన క్లినికల్ ట్రయల్ (''ట్రయల్’’)లో భాగంగా Science 37 ఫ్లాట్‌ఫారాన్ని ఉపయోగించుకునేందుకు ఫ్లాట్‌ఫారం మీకు అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ నియమనిబంధనలు (''నియమనిబంధనలు’’) Science 37 మరియు మీకు అంటే ఫ్లాట్‌ఫారం మరియు సర్వీసును యాక్సెస్ చేసుకోవడం మరియు ఉపయోగించే వ్యక్తి (''మీరు’’ మరియు ''మీ యొక్క’’) మధ్య ఒక చట్టపరమైన ఒప్పందాన్ని ఏర్పరుస్తాయి. ఫ్లాట్‌ఫారం యొక్క ప్రొవిజన్ ఈ నియమనిబంధనల్లో ''సర్వీస్’’గా పేర్కొనబడుతుంది.  

 

ఈ ఫ్లాట్‌ఫారం మరియు సర్వీసును మీకు లభ్యమయ్యేట్లుగా చేయడంలో Science 37 పాత్ర పరిమితంగా ఉంటుంది. Science 37 క్లినికల్ ట్రయల్ స్పాన్సర్, వైద్య సంరక్షణ ప్రదాతలు మరియు సేవల ద్వారా మీకు ట్రయల్ సంబంధిత సేవలు అందించే ఇతర వ్యక్తుల నుంచి స్వతంత్రంగా ఉంటుంది. అటువంటి వైద్య సంరక్షణ ప్రదాతలకు చెందిన వ్యక్తుల చర్యలు, మినహాయింపులు లేదా వారి తెలియజేయబడే ఏదైనా సమాచారానికి Science 37కు ఎలాంటి బాధ్యత లేదా లయబిలిటీ ఉండదు. ఈ ఫ్లాట్‌ఫారం మరియు సర్వీస్ అందించడం ద్వారా, Science 37 వైద్య లేదా ఆరోగ్య సలహా లేదా సర్వీసులను అందించడం లేదు.

మీ గోప్యత

మీ గోప్యతా విధానంలో పేర్కొన్న రీతుల్లో ఫ్లాట్‌ఫారం మరియు సర్వీసు యొక్క మీ ఉపయోగం ద్వారా మీరు అందించే వ్యక్తిగత సమాచారం ఏదైనా మేం ఉపయోగిస్తాం. మేం ఈ డేటాను మరే ఇతర రీతిలో ఉపయోగించం.

ఒకవేళ మీరు యాప్ స్టోరు నుంచి ఫ్లాట్‌ఫారాన్ని డౌన్‌లోడ్ చేసినట్లయితే, అటువంటి యాప్ స్టోరు నియమనిబంధనలు మరియు గోప్యతా విధానం మీకు వర్తించవచ్చు, వారి నియమనిబంధనలను మరియు వారు మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎలా ఉపయోగిస్తారనే దాని గురించి అర్థం చేసుకోవడానికి ఫ్లాట్‌ఫారాన్ని డౌన్‌లోడ్ చేయడానికి మీరు ఉపయోగించే సంబంధిత యాప్ స్టోరు నియమనిబంధనలు మరియు గోప్యతా విధానాన్ని మీరు చదవాలని మేం కోరుతున్నాం.

 

ఫ్లాట్‌ఫారం కోసం సహకారం

మీరు ఫ్లాట్‌ఫారం గురించి మరింత తెలుసుకోవాలని కోరుకున్నా లేదా ఫ్లాట్‌ఫారం ఉపయోగించడంలో మద్దతు అవసరం అయితే, దయచేసి మమ్మల్ని techsupport@science37.comవద్ద సంప్రదించండి.

ఈ నియమనిబంధనలు ఆమోదించడానికి మరియు ఫ్లాట్‌ఫారం ఉపయోగించడానికి మీకు విధిగా 13 ఏళ్లు (లేదా మీరు నివాసం ఉండే దేశం/ప్రాంతంలో కనీస వయస్సుకు సమానమైనది) ) లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి.

చట్టపరమైన ఈ నియమనిబంధనల్లోకి ప్రవేశించడానికి మీకు  సామర్థ్యం లేనట్లయితే (ఉదాహరణకు మీరు మైనర్ కావడం వల్ల), దయచేసి మీ చట్టపరమైన సంరక్షకుడితో ఈ నియమనిబంధనలను చదివేలా ధృవీకరించుకోండి, మీ ఉపయోగం మరియు ఈ నియమనిబంధనలకు వారు సమ్మతి తెలియజేసినట్లయితేనే ఈ ఫ్లాట్‌ఫారాన్ని ఉపయోగించండి.

మీరు ఈ ఫ్లాట్‌ఫారాన్ని ఏ విధంగా ఉపయోగించవచ్చు

ఈ నియమనిబంధనలను పాటించేందుకు అంగీకరించడానికి ప్రతిగా, మీరు బహుశా వీటిని చేయవచ్చు:

(i)        మీ మొబైల్ పరికరంలోకి ఫ్లాట్‌ఫారం యొక్క కాపీని డౌన్‌లోడ్ చేయడం మరియు మీ వ్యక్తిగత ప్రయోజనాల కొరకు మాత్రమే అటువంటి పరికరంపై ఫ్లాట్‌ఫారం మరియు సర్వీసును వీక్షించడం, ఉపయోగించడం మరియు ప్రదర్శించడం; మరియు

(ii)        మేం మీకు "ప్యాచీలు" మరియు తప్పుల సవరణలు చేర్చడం ద్వారా ఏదైనా అనుబంధ సాఫ్ట్‌వేర్ కోడ్ లేదా ఫ్లాట్‌ఫారం యొక్క అప్‌డేట్‌లు అందుకోవడం మరియు ఉపయోగించడం.

మీరు ఫ్లాట్‌ఫారాన్ని మరొకరికి బదిలీ చేయలేరు.

ఈ నియమనిబంధనలకు మీ అంగీకారానికి ప్రతిగా, పైన రూపొందించిన విధంగా ఫ్లాట్‌ఫారం మరియు సర్వీస్ ఉపయోగించడానికి మేం మీకు వ్యక్తిగతంగా హక్కును ఇస్తాం. మీరు ఫ్లాట్‌ఫారం లేదా సర్వీసులను మరొకరికి మరో విధంగా బదిలీ చేయలేకపోవచ్చు.

ఫ్లాట్‌ఫారానికి అప్ డేట్ చేయడం మరియు సర్వీసుకు మార్పులు

పనితీరును మెరుగుపరచడానికి, ఫంక్షనాలిటీని అభివృద్ధి చేయడానికి, ఆపరేటింగ్ సిస్టమ్‌లో మార్పులను ప్రతిబింబింపజేయడానికి లేదా భద్రతా సమస్యలు పరిష్కరించడానికి ప్లాట్‌ఫారం మరియు/లేదా సర్వీస్‌ను మేం ఎప్పటికప్పుడు ఆటోమెటిక్‌గా అప్‌డేట్ చేయగలం లేదా మార్పులు చేయగలం. ప్రత్యామ్నాయంగా, ఈ కారణాల కొరకు ఫ్లాట్‌ఫారాన్ని అప్‌డేట్ చేయాలని మేం మిమ్మల్ని కోరవచ్చు.

మీరు అటువంటి అప్‌డేట్‌లు ఇన్‌స్టాల్ చేయరాదని ఎంచుకున్నా లేదా ఆటోమేటిక్ అప్‌డేట్‌లు వద్దని ఎంచుకున్నా, మీరు ఫ్లాట్‌ఫారం మరియు సర్వీసును ఉపయోగించడాన్ని కొనసాగించలేకపోవచ్చు.

మీరు ఉపయోగిస్తున్న ఫోన్ లేదా డివైస్‌ను మరెవరైనా కలిగి ఉన్నట్లయితే

మీరు స్వంతంగా కలిగి ఉండని ఏదైనా ఫోన్ లేదా ఇతర పరికరంపై ఫ్లాట్‌ఫారాన్ని డౌన్‌లోడ్ చేసినట్లయితే, ఆ విధంగా చేయడానికి మీకు విధిగా యజమాని అనుమతి కావాలి. ఫ్లాట్‌ఫారం డౌన్‌లోడ్ చేసిన ఫోన్ లేదా ఇతర డివైస్ మీ స్వంతమైనా లేదా కాకపోయినా, మీరు ఈ నియమనిబంధనలకు కట్టుబడి ఉండాలి.

లైసెన్స్ పరిమితులు

మీరు దిగువ పేర్కొన్నవి చేయకుండా ఉండేందుకు అంగీకరిస్తున్నారు:

(i)        ఈ లైసెన్స్ ద్వారా ప్రత్యేకంగా అనుమతించినట్లయితే తప్ప, ఫ్లాట్‌ఫారాన్ని కాపీ చేయడం;

(ii)        ఫ్లాట్‌ఫారంపై పేటెంట్ కలిగినా లేదా లేకపోయినా వాటిని సవరించడం, అనువదించడం, స్వీకరించడం, లేదా మరోవిధంగా డెరివేటివ్ వర్కులు లేదా మెరుగుదలను సృష్టించడం;

(iii)       ఫ్లాట్‌ఫారం లేదా దాని ఏదైనా భాగం సోర్సు కోడ్ పొందడం లేదా యాక్సెస్ చేయడానికి రివర్స్ ఇంజినీరింగ్, డిస్‌అసెంబుల్ చేయడం, డీకంపైల్, డీకోడ్, లేదా మరోవిధంగా ప్రయత్నించడం;

(iv)      దాని యొక్క ఏదైనా భాగంతో సహా ఫ్లాట్‌ఫారం నుంచి ఏవైనా ట్రేడ్‌మార్కులు, లేదా ఏవైనా కాపీరైట్, ట్రేడ్ మార్క్, పేటెంట్ లేదా ఇతర మేధోపరమైన ఆస్తి లేదా యాజమాన్య హక్కులను తొలగించడం, డిలీట్ చేయడం, లేదా అస్పష్టంగా మార్చడం;

(v)       ఏదైనా సమయంలో ఒకటి కంటే ఎక్కువ డివైస్‌లను యాక్సెస్ చేసుకునే సామర్ధ్యం కలిగిన నెట్‌వర్క్ మీద ఫ్లాట్‌ఫారం లభ్యమయ్యేలా చేయడంతో సహా, ఏదైనా కారణం కొరకు ఏదైనా థర్డ్ పార్టీకి ఫ్లాట్‌ఫారం, లేదా ఏవైనా ఫీచర్లు లేదా ఫంక్షనాలిటీని అద్దెకు, లీజుకు, అప్పు ఇవ్వడం, సబ్ లైసెన్స్ ఇవ్వడం, అసైన్ చేయడం, పంపిణీ చేయడం, పబ్లిష్ చేయడం, బదిలీ చేయడం లేదా మరోవిధంగా లభ్యమయ్యేలా చేయడం; లేదా

(vi)      ఫ్లాట్‌ఫారంలోని లేదా దానిని సంబంధించి ఏదైనా కాపీ ప్రొటెక్షన్, హక్కుల నిర్వహణ, లేదా భద్రతా ఫీచర్లు తొలగించడం, నిలిపివేయడం.

మీ ప్రాతినిధ్యాలు మరియు వారెంటీలు

ఫ్లాట్‌ఫారాన్ని ఉపయోగించడం ద్వారా మీరు దిగువ పేర్కొన్నవి అంగీకరిస్తున్నారు:

(i)        ఏదైనా చట్టవ్యతిరేక రీతిలో, ఏదైనా చట్టవ్యతిరేక ఉద్దేశ్యం కొరకు, లేదా ఈ నిబంధనలకు అనుగుణంగా లేని ఏదైనా రీతిలో, మీరు ఈ ఫ్లాట్‌ఫారాన్ని లేదా సర్వీస్ ఉపయోగించలేరు లేదా మోసపూరితంగా లేదా దురుద్దేశపూరితంగా వ్యవహరించలేరు, ఉదాహరణకు, హ్యాకింగ్ చేయడం, లేదా ఫ్లాట్‌ఫారం లేదా సర్వీస్‌లోకి వైరస్‌లు లేదా హానికరమైన డేటా వంటి దురుద్దేశపూరిత కోడ్‌ని చొప్పించడం;

(ii)       ఫ్లాట్‌ఫారం లేదా సర్వీసును మీరు ఉపయోగించడానికి సంబంధించి మా మేధోపరమైన హక్కులు లేదా ఎవరైనా థర్డ్ పార్టీ హక్కులను మీరు ఉల్లంఘించరాదు;

(iii)      ఫ్లాట్‌ఫారం లేదా సర్వీసు యొక్క మీ ఉపయోగానికి సంబంధించి పరువు నష్టం కలిగించే, అసహ్యకరమైన లేదా మరో విధంగా అభ్యంతరమైన ఏ మెటీరియల్ అయినా మీరు ప్రసారం చేయరాదు.;

(iv)      మీరు ఫ్లాట్‌ఫారం లేదా సేవలకు నష్టం కలిగించే, నిలిపివేసే, అధిక భారం మోపే, బలహీనపరిచే లేదా భద్రత రాజీపడేలా లేదా ఇతర వినియోగదారులకు అంతరాయం కలిగించే విధంగా ఫ్లాట్‌ఫారం లేదా సేవలను ఉపయోగించరాదు; మరియు

(v)       మీరు సర్వీస్ నుంచి ఏదైనా సమాచారం లేదా డేటాను సేకరించరు లేదా హార్వెస్ట్ చేయరు.

మేధోపరమైన ఆస్తి హక్కులు

ఫ్లాట్‌ఫారం మరియు సర్వీసులో ఉండే అన్ని మేధోపరమైన ఆస్తి హక్కులు Science 37 కు లోబడి ఉంటాయి, ఫ్లాట్‌ఫారం మరియు సర్వీసుల్లోని హక్కు మీకు లైసెన్స్ ఇవ్వబడింది (విక్రయించలేదు). మీకు దీనిలో లేదా ఈ నియమనిబంధనలకు అనుగుణంగా వాటిని ఉపయోగించే హక్కు మినహా ఫ్లాట్‌ఫారం లేదా సర్వీసులో మరే ఇతర హక్కులు ఉండవు.

రద్దు

మీరు ఈ నియమనిబంధనలను ఉల్లంఘించినట్లయితే, ఫ్లాట్‌ఫారం మరియు/లేదా సర్వీసును ఉపయోగించే మీ సామర్ధ్యం రద్దు చేయబడుతుంది. ఈ చర్యలు, చట్టప్రకారం Science 37కు వర్తించే మరే ఇతర హక్కు లేదా పరిష్కారానికి అదనంగా ఉంటాయి.

ఫ్లాట్‌ఫారం యాక్సెస్ చేయడం మరియు ఉపయోగించడాన్ని నిలిపివేయడం ద్వారా మీరు ఈ నియమనిబంధనలను రద్దు చేయవచ్చు.  

ఏ కారణంతోనైనా లేదా ఎలాంటి కారణం లేకుండానే, ఏ సమయంలోనైనా, ఎలాంటి నోటీస్ లేకుండానే మేం ఈ నియమనిబంధనలను రద్దు చేయవచ్చు.

రద్దు చేసిన తరువాత:

ఈ నియమనిబంధనల కింద మంజూరు చేసిన అన్ని హక్కులు కూడా రద్దు చేయబడతాయి, మరియు మీరు ప్లాట్‌ఫారం మొత్తం ఉపయోగాన్ని విధిగా నిలిపివేయాలి మరియు మీ మొబైల్ పరికరం నుంచి యాప్‌ని తొలగించాలి. ఫ్లాట్‌ఫారాన్ని మీరు యాక్సెస్ చేసుకునే హక్కును Science 37 తొలగిస్తుంది.

రద్దు చేసినంత మాత్రాన చట్టం లేదా ధర్మం ప్రకారం Science 37 హక్కులు లేదా పరిహారాలు ఏవీ కుదించబడవు.

వారెంటీల అస్వీకారం. మీకు ఫ్లాట్‌ఫారం "ఎలా ఉంటే అలా" మరియు ఎలాంటి వారెంటీ లేకుండా అన్ని లోపాలు మరియు దోషాలతో సహా అందించబడుతుంది.  వర్తించే చట్టం కింద, గరిష్టంగా అనుమతించే మేరకు, వ్యవహరించేటప్పుడు, పనితీరు సమయంలో, వినియోగం, లేదా వాణిజ్య అమల్లో ఉత్పన్నం కాగల నిర్ధిష్ట ఉద్దేశం, హోదా, లేదా ఉల్లంఘించకపోవడం మరియు వారెంటీల కొరకు మర్చెంటబిలిటీ, ఫిట్‌నెస్ యొక్క అన్ని నిర్ధిష్ట ప్రయోజనాలతో సహా, ఫ్లాట్‌ఫారానికి సంబంధించి వ్యక్తీకరించిన, స్పష్టం చేసిన, చట్టపరమైన లేదా మరోవిధమైన అన్ని వారెంటీలను science 37 ప్రత్యేకంగా అస్వీకరిస్తుంది  . పైన పేర్కొన్నవాటికి ఎలాంటి పరిమితి లేకుండా, ఫ్లాట్‌పారం మీ అవసరాలను తీరుస్తుంది, ఏదైనా ఉద్దేశిత ఫలితాలను సాధిస్తుందని, కంపాటిబుల్‌గా ఉంటుందని, లేదా ఏదైనా ఇతర సాఫ్ట్‌వేర్, అప్లికేషన్‌లు, సిస్టమ్‌లు, లేదా సర్వీస్‌తో పనిచేస్తుందని, అంతరాయం లేకుండా పనిచేస్తుందని, ఏదైనా పనితీరు లేదా విశ్వసనీయమైన ప్రమాణాలను చేరుకుంటుందని, లేదా దోషరహితమైనది, లేదా ఏవైనా లోపాలు లేదా దోషాలు సరి చేయవచ్చు లేదా సరి చేయబడతాయనే దానికి science 37 ఎలాంటి వారెంటీ లేదా హామీని ఇవ్వదు.

పైన పేర్కొన్న దానితో నిమిత్తం లేకుండా, నిర్లక్ష్యం లేదా మోసపూరిత ప్రాతినిధ్యం వల్ల మరణం లేదా వ్యక్తిగత గాయం లేదా వర్తించే చట్టం ద్వారా పరిమితం లేదా మినహాయించలేని ఇతర బాధ్యతకు ఈ నియమనిబంధనల్లో ఏవీ కూడా ఏ పక్షాన్నీ మినహాయింపు కోరడానికి లేదా పరిమితం చేయడానికి ప్రయత్నించవు.

నిర్ధిష్ట అస్వీకారాలను లేదా వారెంటీలను కొన్ని న్యాయపరిధులు అనుమతించవు, అందువల్ల పైన పేర్కొన్న వాటిలో కొన్ని లేదా అన్నీ మీకు వర్తించకపోవచ్చు.

ఫ్లాట్‌ఫారం భద్రత. ఇతర ఇంటర్నెట్ సాఫ్ట్‌వేర్ లేదా సర్వీసుల లాగానే, ఈ ప్లాట్‌ఫారం భద్రతా సమస్యలకు గురికావొచ్చు అని మీరు అర్థం చేసుకున్నారు మరియు అంగీకరిస్తున్నారు ( యూజర్‌ల ద్వారా కలిగించే భద్రతా సమస్యలు, నెట్‌వర్క్ సర్వీస్ నాణ్యతా, సామాజిక పర్యావరణం, వైరస్‌లు, ట్రోజాన్ హార్స్ ప్రోగ్రామ్‌లు, మోసపూరితమైన ప్రోగ్రామ్‌లు మొదలైనవాటితో సహా, కానీ వారికే పరిమితం కాకుండా). అసురక్షిత ఇంటర్నెట్ కనెక్షన్ లను ఉపయోగించి మీరు లేదా మీ మొబైల్ పరికరం ద్వారా చేసే ఏదైనా డేటా ప్రసార భద్రతకు Science 37 బాధ్యత వహించదు మరియు ధృవీకరించదు. ప్లాట్‌ఫారాన్ని ఉపయోగించడంలోని అంతర్గత భద్రతా ప్రమాదాలను మీరు అంగీకరిస్తారు, మరియు మీ పరికరాన్ని సంరక్షించడానికి భద్రతా చర్యలను చేపట్టాలని మేం మీకు సలహా ఇస్తాం (అప్‌డేట్ చేసిన యాంటీవైరస్ సిస్టమ్‌లు వంటివి).

బాధ్యత యొక్క పరిమితి. వర్తించే చట్టం ద్వారా పూర్తిగా అనుమతించిన మేరకు, ఫ్లాట్‌ఫారం లేదా కంటెంట్ మరియు సర్వీసులను మీరు ఉపయోగించడం లేదా ఉపయోగించలేకపోవడం వల్ల ఉత్పన్నం అయ్యే వాటికి SCIENCE 37కు ఎలాంటి లయబిలిటీ లేదా బాధ్యత ఉండదు:

వ్యక్తిగత గాయం, ఆస్తికి నష్టం, లాభాలు కోల్పోవడం, ప్రత్యామ్నాయ వస్తువులు లేదా సేవల ఖర్చు, డేటా కోల్పోవడం, ప్రతిష్ఠను కోల్పోవడం, వ్యాపార అంతరాయం, కంప్యూటర్ విఫలం కావడం లేదా సరిగ్గా పనిచేకపోవడం, లేదా ఏదైనా ఇతర పర్యవసాన, ఘటనాత్మక, పరోక్ష, విలక్షణమైన, ప్రత్యేకమైన, లేదా శిక్షాత్మక నష్టాలు.

ఒప్పందం ఉల్లంఘన, అపరాధం (నిర్లక్ష్యంతో సహా), లేదా ఇతరత్రా మరియు అటువంటి నష్టాలు ఊహించినవి లేదా అటువంటి నష్టం గురించి SCIENCE 37 కు సలహా ఇచ్చినప్పటికీ, అటువంటి నష్టాలు చోటు చేసుకున్నట్లయితే, పైన పేర్కొన్న పరిమితులు వస్తాయి. కొన్ని న్యాయపరిధులు బాధ్యత యొక్క నిర్ధిష్ట పరిమితులను అనుమతించవచ్చు తద్వారా లయబిలిటీ యొక్క పైన పేర్కొన్న పరిమితులు కొన్ని లేదా అన్నీ మీకు వర్తించకపోవచ్చు.

నష్టపరిహారం. మీరు సబ్మిట్ చేసే లేదా ఈ ఫ్లాట్‌ఫారం ద్వారా లభ్యమయ్యే కంటెంట్‌ సహా, కానీ దానికే పరిమితం కాకుండా, ఫ్లాట్‌ఫారం యొక్క మీ ఉపయోగం లేదా దుర్వినియోగం లేదా ఈ నియమనిబంధనలను ఉల్లంఘించడం వల్ల ఉత్పన్నమయ్యే సముచితమైన అటార్నీ ఫీజులతో సహా ఏవైనా మరియు అన్ని నష్టాలు, డ్యామేజీలు, లయబిలిటీస్, లోపాలు, క్లెయింలు, చర్యలు, తీర్పులు, సెటిల్‌మెంట్లు, వడ్డీ, తీర్పు,లు, జరిమానాలు, అపరాధాలు, ఖర్చులు లేదా వ్యయాల నుంచి మరియు వాటికి విరుద్ధంగా Science 37 మరియు దాని అధికారులు, డైరెక్టర్లు, ఉద్యోగులు, ఏజెంట్లు, అఫిలియేట్లు, వారసులు మరియు అసైనీలకు నష్టపరిహారం చెల్లించేందుకు, సమర్ధించేందుకు మరియు ఎలాంటి హాని చేయకుండా ఉండేందుకు మీరు అంగీకరిస్తున్నారు.

వేరుపడిపోవడం. ఈ నియమనిబంధనల్లో ఏదైనా నిబంధన చట్టవ్యతిరేకమైనా లేదా వర్తించే చట్టం ప్రకారం అమలు చేయలేకపోయినట్లయితే, అటువంటి నిబంధన సాధ్యమైనంత వాస్తవంగా, ముందుగా ఉన్న నిబంధన ప్రభావానికి సాధ్యమైనంత దగ్గరగా ఉండే విధంగా సవరించబడుతుంది.  ఈ నియమనిబంధనల్లోని ఇతర నిబంధనలు అన్నీ కూడా పూర్తిగా అమల్లో ఉంటాయి.

పరిపాలించే చట్టం. ఈ నియమనిబంధనలు ఏ ఎంపిక లేదా చట్ట నిబంధన ఉల్లంఘన లేదా నిబంధనపై ప్రభావం చూపించకుండా అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర అంతర్గత చట్టాలకు అనుగుణంగా నిర్వహించబడతాయి మరియు రూపొందించబడతాయి. ఈ నియమనిబంధనలు లేదా ఫ్లాట్‌ఫారానికి సంబంధించిన లేదా ఉత్పన్నమయ్యే ఏదైనా చట్టపరమైన దావా, చర్య లేదా ప్రొసీడింగ్ కాలిఫోర్నియా రాష్ట్రంలోని కోర్టుల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడుతుంది. అటువంటి కోర్టులు మరియు అటువంటి కోర్టుల్లో వేదిక ద్వారా మీ పై అధికార పరిధిని అమలు చేయడానికి మీరు ఏవైనా మరియు అన్ని అభ్యంతరాలను  మాఫీ చేస్తారు.

మొత్తం ఒప్పందం. ఈ నియమనిబంధనలు మరియు మా గోప్యతా విధానం ఫ్లాట్‌ఫారం మరియు సేవలకు సంబంధించి మీకు మరియు Science 37 మధ్య పూర్తి ఒప్పందాన్ని ఏర్పరుస్తాయి, ఫ్లాట్‌ఫారానికి సంబంధించిన గత లేదా సమకాలీన అవగాహనలు లేదా ఒప్పందాలు, అవి రాతపూర్వకంగా లేదా మౌఖికంగా అయినప్పటికీ, అవన్నీ కూడా రద్దవుతాయి.

మాఫీ చేయడం.ఏదైనా పక్షం ద్వారా ఏదైనా హక్కు లేదా ఇందులో పేర్కొనబడ్డ ఏదైనా అధికారాన్ని అమలు చేయడంలో విఫలం కావడం, లేదా ఆలస్యం కావడం అనేది మాఫీ చేయడంగా పరిగణించబడదు, లేదా ఏ హక్కు లేదా అధికారాన్ని ఏ ఒక్క లేదా పాక్షిక అమలు చేయడం దాని కింద లేదా మరే ఇతర హక్కును తదుపరి ఉపయోగించడాన్ని నిరోధించదు. ఈ నియమనిబంధనల మధ్య గానీ, అలాగే వర్తించే కొనుగోలు లేదా ఇతర నిబంధనల మధ్య గానీ వైరుధ్యం సంభవించినట్లయితే, ఈ నియమనిబంధనలు అమలవుతాయి.

కాంట్రాక్ట్ నిబంధనలను అప్‌డేట్ చేయడం. ఈ నియమనిబంధనలు నియతానుసారంగా అప్‌డేట్ అవుతూ ఉండవచ్చు. ఫ్లాట్‌ఫారం ఉపయోగించడాన్ని కొనసాగించడం ద్వారా, అప్‌డేట్ చేసిన అన్ని నియమనిబంధనలను మీరు అంగీకరించినట్లు పరిగణిస్తాం. ఒకవేళ మీరు ఏవైనా అప్‌డేట్ చేసిన నియమనిబంధనలను అంగీకరించనట్లయితే, మీరు ఫ్లాట్‌ఫారంను ఉపయోగించడాన్ని నిలిపివేయాలి.

మమ్మల్ని కాంటాక్ట్ చేయండి

మీకు ఈ నియమనిబంధనల గురించి ఏవైనా ప్రశ్నలున్నా లేదా Science 37 కు నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నా లేదా కమ్యూనికేట్ చేయాలని అనుకున్నా, దయచేసి మమ్మల్ని Legal@Science37.com వద్ద సంప్రదించండి.