గోప్యతా విధానం
చివరగా అప్‌డేట్ చేసింది, సెప్టెంబర్ 27, 2023
గ్లోబల్ గోప్యతా విధానం ఉద్దేశం
Science 37, Inc. (“Science 37,” “మేం,” లేదా “మమ్ములను”) మీ సమాచారాన్ని రక్షించటానికి కట్టుబడి ఉంది. ఆ దిశగా, మీ సమాచారాన్ని మేం ఎలా ప్రాసెస్ చేస్తామో మీరు తెలుసుకోవాలని మేం కోరుకుంటున్నాం. మేం మా వెబ్‌సైట్ https://www.science37.com/; వైద్య అధ్యయనాల ద్వారా; మేం నియంత్రించే సోషల్ మీడియా పేజీలు, ఈ గోప్యతా విధానాన్ని (“సోషల్ మీడియా పేజీల ద్వారా”) మీరు ఎక్కడ నుంచి యాక్సెస్ చేసుకుంటుంది,; ఈ గోప్యతా విధానాన్ని, ఇతర కమ్యూనికేషన్‌లను లింక్ చేస్తూ మేం పంపించే HTML-ఫార్మెట్‌లోని ఈమెయిల్ సందేశాల ద్వారా; మాతో మీరు జరిపే ఇతర ఆఫ్‌లైన్ ఇంటరాక్షన్స్ ద్వారా మేం సమాచారాన్ని ఎలా సేకరిస్తాం, వినియోగిస్తాం, వెల్లడిస్తాం అనేది Science 37 గ్లోబల్ గోప్యతా విధానం (“గోప్యతా విధానం”) వివరిస్తుంది. వెబ్‌సైట్, సోషల్ మీడియా పేజీలు, ఈమెయిల్స్, ఆఫ్‌లైన్ ఇంటరాక్షన్‌లు అన్నింటిని కలిపి మేం "సేవలు" అని వ్యవహరిస్తాం.
మీరు వైద్య అధ్యయనం కోసం వెబ్-ఆధారిత లేదా మొబైల్ అప్లికేషన్ ప్లాట్‌ఫారాన్ని ఉపయోగిస్తుంటే, Science 37 ప్లాట్‌ఫాం ద్వారా సేకరించే సమాచారాన్ని మేం ఎలా ప్రాసెస్ చేస్తామనే దానిపై మరింత తెలుసుకోవడానికి, దయచేసి Science 37 వెబ్-ఆధారిత, మొబైల్ అప్లికేషన్ ప్లాట్‌ఫారం గోప్యతా విధానాన్ని సందర్శించండి.
విషయ సూచిక
మేం సేకరించే వ్యక్తిగత, ఇతర సమాచారం మరియు దాన్ని ఎలా సేకరిస్తాం
మేం మీ సమాచారాన్ని ఎలా వాడతాం, ఎలా ప్రాసెస్ చేస్తాం
మీ సమాచార వెల్లడి
ఆసక్తి-ఆధారిత, థర్డ్ పార్టీ ప్రకటనలు
మీ సమాచార బదిలీ, భద్రపరచడం
డేటాను ఉంచిపెట్టడం
భద్రత
సున్నితమైన సమాచారం
పిల్లలు
డైరెక్ట్ మార్కెటింగ్ విషయంలో మీ ఎంపికలు
మీ హక్కులు
బాహ్య లేదా థర్డ్ పార్టీ లింక్స్
గోప్యతా విధానానికి మార్పులు
మమ్మల్ని ఎలా సంప్రదించాలి
EEA, UKకు సంబంధించిన అదనపు సమాచారం
కాలిఫోర్నియాకు సంబంధించిన అదనపు సమాచారం
మేం సేకరించే వ్యక్తిగత, ఇతర సమాచారం మరియు దాన్ని ఎలా సేకరిస్తాం
వ్యక్తిగత సమాచారం
ఈ గోప్యతా విధానంలో వినియోగించిన విధంగా, "వ్యక్తిగత సమాచారం" అంటే ఒక వ్యక్తిగా మిమ్మల్ని గుర్తించడానికి లేదా ఒక నిర్దిష్టమైన సహజ వ్యక్తితో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మిమ్మల్ని అనుసంధానించడానికి ఉపయోగించే సమాచారం. ఈ కింద పేర్కొన్న వ్యక్తిగత సమాచారాన్ని సర్వీస్‌లు సేకరిస్తాయి: పేరు, అడ్రస్, టెలిఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, ఇతర సంప్రదించు సమాచారం, జాబ్ అప్లికేషన్‌లో అందించిన రెజ్యూమ్, CV సమాచారం, ఆరోగ్య సంబంధమైన సమాచారం, IP అడ్రస్.
అభ్యర్థించిన సేవల్ని మీకు అందించడానికి మేం మీ వ్యక్తిగత సమాచారాన్ని సేకరించాలి. మీరు మేం కోరిన సమాచారాన్ని అందించకపోతే, మేం సేవల్ని అందించలేకపోవచ్చు. సేవలకు సంబంధించి మీరు ఇతర వ్యక్తులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని మాకు వెల్లడిస్తే, అలా చేయడానికి మీరు అధికారం ఉందని, ఆ సమాచారాన్ని ఈ గోప్యతా విధానానికి అనుగుణంగా ఉపయోగించుకునేందుకు మీరు మాకు అనుమతినిస్తున్నట్టుగా మేం పరిగణిస్తాం.
మేం, మా సర్వీస్ ప్రొవైడర్లు సాధారణంగా సేవల ద్వారా, జాబ్ అప్లికేషన్ ప్రాసెస్ ద్వారా, అలాగే ఇతర మార్గాలతో సహా వేర్వేరు రూపాల్లో వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తాం.
సేవలు మరియు వైద్య అధ్యయనంలో ఆసక్తిని నమోదు చేయటం ద్వారా
మేం సేవల ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తాం - ఉదాహరణకు, మీరు వైద్య అధ్యయనానికి ఆసక్తిని వ్యక్తం చేసినప్పుడు లేదా సైనప్ చేసినప్పుడు, సేవలను యాక్సెస్ చేసేందుకు అకౌంట్ రిజిస్టర్ చేసుకున్నప్పుడు, మా ఈవెంట్స్‌లో హాజరైనప్పుడు లేదా న్యూస్ లెటర్ కోసం సైనప్ చేసుకున్నప్పుడు.
మీరు Science 37 వైద్య అధ్యయనంలో నమోదు చేసుకున్నట్లయితే, డేటా ప్రాసెసింగ్‌కు సంబంధించి మీరు ఒక సవిస్తరమైన ఈమెయిల్ అందుకుంటారు. అందులో వైద్య అధ్యయన ప్రక్రియను ప్రారంభించే సమయంలో వ్యక్తిగత సమాచారాన్ని ఎలా సేకరిస్తామో వివరిస్తాం.
ఉద్యోగ అవకాశాలు
మా వెబ్‌సైట్ ద్వారా మీరు ఉద్యోగాల కోసం అప్లై చేస్తే, మీ అప్లికేషన్‌తో పాటు మీరు అందించే అదనపు సమాచారాన్ని Science 37 కెరియర్ అవకాశాల్లో పేర్కొన్న విధంగా మీకున్న నైపుణ్యాలను, ఆసక్తులను అంచనా వేయడానికి ఉపయోగించవచ్చు. అలాగే, ఆయా దేశాల నిర్దిష్ట చట్టాల ప్రకారం రిపోర్ట్ చేయడానికి కూడా అవసరం కావచ్చు. మీతో కమ్యూనికేషన్ కొనసాగించేందుకు, కెరియర్ అవకాశాల గురించి మీకు సమాచారం అందించేందుకు కూడా మేం మీ సమాచారాన్ని ఉపయోగించుకోవచ్చు.
ఇతర మార్గాలు
మేం ఇతర మార్గాల ద్వారా మీ వ్యక్తిగత సమాచారాన్ని పొందుతాం - ఉదాహరణకు, బహిరంగంగా అందుబాటులో ఉన్న డేటాబేస్‌లు, వైద్య అధ్యయన రిక్రూటింగ్ భాగస్వాములు, జాయింట్ మార్కెటింగ్ భాగస్వాములు మాతో సమాచారాన్ని పంచుకున్నప్పుడు.
ఇతర సమాచారం
“ఇతర సమాచారం” అంటే, మీ నిర్దిష్ట గుర్తింపును వెల్లడించని ఏదైనా సమాచారం కావచ్చు లేదా గుర్తించదగిన వ్యక్తికి నేరుగా సూచించని సమాచారాన్ని సూచిస్తుంది. ఉదాహరణకు, ఉపయోగిస్తున్న ఇంటర్నెట్ బ్రౌజర్, ఆపరేటింగ్ సిస్టమ్‌కు సంబంధించిన సమాచారం; మీరు ఏ వెబ్‌సైట్ నుంచి వచ్చారో ఆ డొమైన్ పేరు; విజిట్స్ సంఖ్య; సైట్‌పైన వెచ్చించిన సగటు సమయం; చూసిన పేజీలు వంటివి. ఇతర సమాచారాన్ని మా వెబ్‌సైట్ ప్రస్తుతాన్వయాన్ని లేదా ఔచిత్యాన్ని మానిటర్ చేయడానికి, దాని పనితీరు, కంటెంట్‌ను మెరుగుపర్చడం వంటి వాటికి మేం ఉపయోగించవచ్చు.
వర్తించే చట్టం ప్రకారం మరోవిధంగా చేయాల్సిన అవసరం ఉంటే తప్ప, మేం ఇతర సమాచారాన్ని ఏ ఉద్దేశం కోసమైనా ఉపయోగించుకోవచ్చు, వెల్లడించవచ్చు. వర్తించే చట్టం ప్రకారం ఇతర సమాచారాన్ని వ్యక్తిగత సమాచారంగానే పరిగణించాల్సి ఉంటే, ఈ పాలసీలో వివరించిన విధంగా వ్యక్తిగత సమాచారాన్ని ఏ ఉద్దేశాల కోసం ఉపయోగించాల్సి, వెల్లడించాల్సి ఉంటుందో దాన్నే పాటిస్తాం. కొన్ని సందర్భాల్లో మేం ఇతర సమాచారాన్ని వ్యక్తిగత సమాచారంతో జోడిస్తాం. అలా చేసినప్పుడు, అది జోడించినంత కాలం దాన్ని వ్యక్తిగత సమాచారంగానే పరిగణిస్తాం.
మీ బ్రౌజర్ లేదా డివైస్ నుంచి; కుకీస్ నుంచి; క్లియర్ gifsలు/వెబ్ బీకాన్లు నుంచి; అనలిటిక్స్ నుంచి; సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కిట్స్ (“SDKలు”), మొబైల్ అడ్వర్టైజింగ్ IDలు; థర్డ్-పార్టీ ప్లగిన్స్; థర్డ్-పార్టీ ఆన్‌లైన్ ట్రాకింగ్; అడోబ్ ఫ్లాష్ టెక్నాలజీ; భౌతిక లొకేషన్‌తో సహా మేం వేర్వేరు మార్గాల్లో ఇతర సమాచారాన్ని సేకరిస్తాం.
మీ బ్రౌజర్ లేదా డివైస్ నుంచి
చాలా బ్రౌజర్లు మీ మీడియా యాక్సెస్ కంట్రోల్ (MAC) అడ్రస్, కంప్యూటర్ టైప్ (విండోస్ లేదా మ్యాక్), స్క్రీన్ రిజల్యూషన్, ఆపరేటింగ్ సిస్టమ్ పేరు, వెర్షన్, డివైస్ తయారీదారు, మోడల్, భాష, ఇంటర్నెట్ బ్రౌజర్ టైపు, వెర్షన్, మీరు వాడే సేవల పేర్లు, వెర్షన్ వంటి నిర్ధిష్ట సమాచారాన్ని మీ డివైస్ ద్వారా ఆటోమెటిక్‌గానే సేకరిస్తాయి. సేవలు సరిగ్గా పనిచేసేలా చూడటానికి మేం ఈ సమాచారాన్ని ఉపయోగిస్తాం.
కుకీస్ (మీ కంప్యూటర్‌లో ఆటోమేటిక్‌గా భద్రపరిచే సమాచారం)
మేం మా వెబ్‌సైట్‌లో కుకీస్ వాడతాం. కుకీస్ అంటే మీ బ్రౌజర్ మీ కంప్యూటర్‌పై స్టోర్ చేసే చిన్న ఫైల్స్. మీరు ఇంతకుముందు సందర్శించారా లేదా అని మా వెబ్‌సైట్ గుర్తించేందుకు కుకీ సహాయపడుతుంది. అలాగే యూజర్ ప్రాధాన్యతల్ని, ఇతర సమాచారాన్ని భద్రపరుస్తుంది. ఉదాహరణకు, మీ ప్రస్తుత సెషన్‌లోనూ, మొత్తంగానూ మా వెబ్‌సైట్‌ను మీరు ఎలా వాడారు (మీరు చూసిన పేజీలు, మీరు డౌన్‌లోడ్ చేసుకున్న ఫైల్స్ సహా), మీ కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్, బ్రౌజర్ టైపు, మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్, మీ డొమైన్ పేరు, IP అడ్రస్, మీ సాధారణ భౌగోళిక ప్రాంతం, మా వెబ్‌సైట్‌కు ముందు మీరు సందర్శించిన వెబ్‌సైట్, మా వెబ్‌సైట్‌ను వదిలిపెట్టేందుకు మీరు ఉపయోగించుకున్న లింక్ వంటి సమాచారం. మీ కంప్యూటర్‌లో కుకీస్ ఉండటం మీకు ఇష్టం లేకపోతే, మీ బ్రౌజర్లో కుకీస్ అన్నింటినీ తిరస్కరిస్తూ సెట్టింగ్స్ మార్చుకోవచ్చు లేదా ఒక కుకీ సెట్ అయ్యేటప్పుడు అనుమతించాలా, వద్దా అని అడిగే విధంగా మార్చుకోవచ్చు. మీరు మీ కంప్యూటర్ నుంచి కూడా కుకీస్ డిలీట్ చేయవచ్చు. అయితే, మీరు కుకీస్‌ని బ్లాక్ లేదా డిలీట్ చేయాలని ఎంచుకుంటే, వెబ్‌సైట్‌లో కొన్ని ఫీచర్స్ సరిగా పని చేయకపోవచ్చు.
Science 37 కుకీస్ వాడకానికి సంబంధించి సవిస్తర సమాచారం కోసం, దయచేసి Science 37 కుకీ పాలసీని చూడండి.
క్లియర్ Gifs
క్లియర్ Gifs (వీటిని వెబ్ బీకాన్స్, వెబ్ బగ్స్, లేదా పిక్సెల్ ట్యాగ్స్ అని కూడా పిలుస్తారు) అనే సాఫ్ట్‌వేర్ టెక్నాలజీని, ఈ-ట్యాగ్స్, జావాస్క్రిప్ట్ అని పిలిచే ఇతర టెక్నాలజీలను మేం వినియోగిస్తాం. ఇవి ఏ కంటెంట్ ప్రభావవంతంగా ఉందనే విషయాన్ని తెలియజేయడం ద్వారా మా సైట్‌పైన కంటెంట్‌ని మెరుగ్గా నిర్వహించడంలో మాకు సాయపడతాయి. క్లియర్ Gifs ఒక విశిష్టమైన ఐడెంటిఫైయర్ ఉండే చాలా చిన్న గ్రాఫిక్స్. ఇవి కూడా కుకీస్ లాగానే వెబ్ యూజర్ల ఆన్‌లైన్ కదలికల్ని ట్రాక్ చేసేందుకు ఉపయోగపడతాయి. కుకీస్ కంప్యూటర్ హార్డ్ డ్రైవ్‌లో స్టోర్ అయితాయి కానీ పీరియడ్ సైజులో ఉండే క్లియర్ Gifs వెబ్ పేజీలోనే కనిపించకుండా ఉండిపోతాయి. మేం మా యాజర్ల వ్యక్తిగత సమాచారాన్ని క్లియర్ Gifs, ఈ-ట్యాగ్స్, లేదా జావాస్క్రిప్ట్ ద్వారా సేకరించే సమాచారంతో జత చేయం. Science 37 క్లియర్ Gifs, ఇతర టెక్నాలజీలకు సంబంధించి వివరమైన సమాచారం కోసం, దయచేసి Science 37 కుకీ పాలసీని చూడండి.
ఎనలిటిక్స్
పైన చర్చించిన విధంగా ఆటోమేటిక్‌గా సేకరించే సమాచారాన్ని పొందడానికి, అలాగే ఎనలిటిక్స్, ఆడిటింగ్, రీసెర్చ్, రిపోర్టింగ్‌లో పాల్పంచుకునేందుకు మేం కొన్ని థర్డ్ పార్టీలతో భాగస్వామ్యం కలిగి ఉన్నాం. ఈ థర్డ్ పార్టీలు వెబ్ లాగ్స్ లేదా వెబ్ బీకాన్స్ ఉపయోగించవచ్చు, అలాగే అవి మీ కంప్యూటర్‌పై లేదా మరేదైనా డివైస్‌పై కుకీస్‌ను సెట్ చేసి, యాక్సెస్ చేయవచ్చు. ముఖ్యంగా, పైన పేర్కొన్న ఉద్దేశాల రీత్యా నిశ్చితమైన సమాచారాన్ని సేకరించి, విశ్లేషించడంలో సహాయపడటానికి వెబ్‌సైట్ గూగుల్ ఎనలిటిక్స్ను ఉపయోగించుకుంటుంది. ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా గూగుల్ ఎనలిటిక్స్ కుకీల వినియోగం నుంచి వైదొలగవచ్చు.
SDKలు మరియు మొబైల్ అడ్వర్టైజింగ్ IDలు
మా సేవల్లో థర్డ్ పార్టీ SDKలు ఉండవచ్చు. అవి మీ యాక్టివిటీకి సంబంధించిన సమాచారాన్ని సేకరించటంలో మమ్మల్ని, మా సర్వీస్ ప్రొవైడర్లను అనుమతిస్తాయి. అంతే కాకుండా, కొన్ని మొబైల్ డివైస్‌లు రీసెట్ చేయగల అడ్వర్టైజింగ్ IDతో (ఉదాహరణకు యాపిల్‌కు చెందిన IDFA, గూగుల్‌కు చెందిన అడ్వర్టైజింగ్ ID) వస్తాయి. అది కుకీస్, పిక్సెల్ ట్యాగ్స్ మాదిరిగానే మా సర్వీస్ ప్రొవైడర్లు అడ్వర్టైజింగ్ ప్రయోజనాల కోసం మీ మొబైల్ డివైస్‌ను గుర్తించేందుకు వీలు కల్పిస్తాయి.
థర్డ్ పార్టీ ప్లగిన్‌లు
మా వెబ్‌సైట్‌లో సోషల్ మీడియా కంపెనీలు (ఉదాహరణకు, ఫేస్‌బుక్ "లైక్" బటన్) సహా, ఇతర కంపెనీల ప్లగిన్‌లు ఉంటాయి. ఈ ప్లగిన్‌లు మీరు సందర్శించిన పేజీ వంటి సమాచారాన్ని సేకరించవచ్చు. మీరు ప్లగిన్ పైన క్లిక్ చేయకున్నా ఆ సమాచారాన్ని ఆ ప్లగిన్‌ని క్రియేట్ చేసిన కంపెనీతో పంచుకుంటాయి. ఈ థర్డ్ పార్టీ ప్లగిన్స్ వాటిని సృష్టించిన కంపెనీకి సంబంధించిన గోప్యతా విధానాలు, నిబంధనల ప్రకారం నిర్వహించబడతాయి.
థర్డ్ పార్టీ ఆన్‌లైన్ ట్రాకింగ్
ఈ సెక్షన్‌లో వివరించిన కొంత సమాచారాన్ని సేకరించడానికి, విశ్లేషించడానికి, వాడుకోవడానికి మేం కొన్ని థర్డ్ పార్టీలతో భాగస్వామ్యం కలిగి ఉండవచ్చు. ఉదాహరణకు, మేం వెబ్‌సైట్‌లో లేదా మా నుంచి వచ్చే ఈమెయిల్ సందేశాల్లో కుకీలు సెట్ చేయడానికి లేదా వెబ్ బీకాన్లు వాడటానికి మేం థర్డ్ పార్టీలను అనుమతించవచ్చు. ఆ సమాచారాన్ని ఆన్‌లైన్ వెబ్‌సైట్ ఎనలిటిక్స్, ఇంటర్నెట్-ఆధారిత అడ్వర్టైజింగ్ వంటితో సహా వివిధ రకాల అవసరాల కోసం వాడుకోవచ్చు. ఈ వినియోగం గురించి మరింత తెలుసుకోవాలంటే, దయచేసి కింద పేర్కొన్న "ఎనలిటిక్స్ మరియు ఇంటర్నెట్-ఆధారిత అడ్వర్టైజింగ్" అనే సెక్షన్‌ని చూడండి.
ఒకటిగా చేసిన, గుర్తించలేని సమాచారం
ఎప్పటికప్పుడు మేం సేవల యూజర్ల గురించిన సంగ్రహించిన, గుర్తించలేని సమాచారాన్ని కూడా సేకరించవచ్చు, పంచుకోవచ్చు. అలాంటి సంగ్రహం చేసిన లేదా గుర్తించలేని సమాచారం మిమ్మల్ని వ్యక్తిగతంగా గుర్తించదు.
మేం మీ సమాచారాన్ని ఎలా వాడతాం, ఎలా ప్రాసెస్ చేస్తాం
ఈ కింద పేర్కొన్న ప్రయోజనాల కోసం సేకరించే వ్యక్తిగత సమాచారాన్ని మేం, మా సర్వీస్ ప్రొవైడర్లు ఉపయోగించుకుంటాం:
మీతో మా ఒప్పంద సంబంధాన్ని నిర్వహించేందుకు, అలాగే/లేదా చట్టపరమైన బాధ్యతకు కట్టుబడి ఉండేందుకు మేం ఈ కార్యకలాపాల్లో పాల్పంచుకుంటాం.
మేం ఈ యాక్టివిటీలో మీ సమ్మతితో లేదా మాకు న్యాయమైన ప్రయోజనం ఉన్నప్పుడు భాగం అవుతాం.
మా చట్టపరమైన ప్రయోజనాలపై ఆధారపడి, అలాగే వర్తించే చట్టం అనుమతించే మేరకు మీ సమ్మతితో మేం మీకు వ్యక్తిగతీకరించిన సేవలు అందిస్తాం.
మీతో మా ఒప్పంద సంబంధాన్ని నిర్వహించేందుకు, చట్టపరమైన బాధ్యతకు కట్టుబడి ఉండేందుకు, మరియు/లేదా మా చట్టపరమైన ప్రయోజనాల రుజువుగా మేం ఈ కార్యకలాపాల్లో పాలుపంచుకుంటాం.
వెబ్‌సైట్ ద్వారా మేం సేకరించే సమాచారాన్ని మేం ఇతర సందర్భాల్లో సేకరించే సమాచారంతో జతచేస్తాం. కానీ అలా చేసినప్పుడు మేం ఆ ఉమ్మడి సమాచారాన్ని ఈ గోప్యతా విధానానికి కట్టుబడి మాత్రమే వ్యవహరిస్తాం.
మీ సమాచార వెల్లడి
మాకు మా అధ్యయనాల్లోలో సహకారం అందించే ధర్డ్ పార్టీలకు, ఇతర థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్లకు, ఇతర మాధ్యమాల ద్వారా మేం వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడి చేస్తాం. మీరు కూడా స్వయంగా మీ వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడించవచ్చు.
వైద్య అధ్యయనాలు
మేం సేకరించే లేదా మీరు మాకు అందించే వ్యక్తిగత సమాచారాన్ని మేం మా వైద్య అధ్యయనాలకు సహకరించే లేదా ఈ గోప్యతా విధానంలో పేర్కొన్న విధంగా ఇతర సేవలు అందించే థర్డ్ పార్టీలకు వెల్లడించవచ్చు. అలాంటి థర్డ్ పార్టీలు ఏవైనా వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచడానికి, మేం దాన్ని వెల్లడి చేసిన ఉద్దేశాల కొరకు మాత్రమే వెల్లడించేందుకు చేసుకున్న ఒప్పందానికి కట్టుబడి ఉంటాయి.
థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్‌లు
వెబ్-హోస్టింగ్ కంపెనీలు, మెయిలింగ్ వెండర్స్, ఎనలిటిక్స్ ప్రొవైడర్స్ సహా మా తరఫున సేవలు అందించే థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్‌లను Science 37 ఉపయోగించుకుంటుంది. ఈ సర్వీస్ ప్రొవైడర్లు పైన వివరించిన ఉద్దేశాలను సాధించడంలో మాకు సహాయపడేందుకు, మిమ్మల్ని వ్యక్తిగతంగా గుర్తించే సమాచారంతో పాటు మీ సమాచారాన్ని సేకరించవచ్చు మరియు/లేదా ఉపయోగించవచ్చు.
సేవల కోసం మీరు చేసే అభ్యర్థనలను పూర్తి చేసేందుకు; మీరు ప్రారంభించిన లావాదేవీ పూర్తి చేసేందుకు; మీరు మాతో గానీ, మా భాగస్వాములతో గానీ చేసుకున్న ఒప్పందం షరతులను పూరించేందుకు; లేదా మా వ్యాపార నిర్వహణ కోసం అవసరమైనపుడు మేం మీ సమాచారాన్ని థర్డ్ పార్టీలతో పంచుకోగలం.
ఇతర వినియోగాలు, ప్రకటనలు
మీ వ్యక్తిగత సమాచారాన్ని అవసరమైన లేదా తగిన విధంగా, ముఖ్యంగా అలా చేసేందుకు మాపైన చట్టపరమైన బాధ్యత లేదా చట్టబద్ధమైన ప్రయోజనం ఏదైనా ఉన్నప్పుడు కూడా మేం ఉపయోగించుకుంటాం, వెల్లడి చేస్తాం. అవి ఏమి అంటే:
మీరు స్వంతంగా వెల్లడించడం
సేవలను వినియోగించుకోవడం ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడించడాన్ని మీరు ఎంచుకోవచ్చు. ఇందులో భాగంగా మెసేజ్ బోర్డులు, చాట్, ప్రొఫైల్ పేజీలు, బ్లాగ్స్, ఇంకా మీరు మీ సమాచారాన్ని, కంటెంట్‌ను (మా సోషల్ మీడియా పేజీలతో పాటు) పోస్ట్ చేసేందుకు ఉపయోగించుకునే ఇతర సేవల ద్వారా వెల్లడించవచ్చు. ఈ సేవల ద్వారా మీరు పోస్ట్ చేసే లేదా వెల్లడించే ఏ సమాచారమైనా బహిరంగం అవుతుందని, అది ఇతర యూజర్లకు, సాధారణ ప్రజలకు సైతం అందుబాటులోకి వస్తుందని దయచేసి గమనించండి. ఇందులో మీరు మీ సోషల్ షేరింగ్ యాక్టివిటీ ద్వారా వెల్లడించే సమాచారం కూడా భాగమే.
ఆసక్తి-ఆధారిత, థర్డ్ పార్టీ ప్రకటనలు
ఆన్‌లైన్ ఆసక్తి-ఆధారిత ప్రకటనలలో ఉపయోగించడానికి మీ గురించిన, మీ కంప్యూటింగ్ పరికరం గురించిన సమాచారాన్ని సేకరించేందుకు వెబ్‌సైట్ థర్డ్ పార్టీ ట్రాకింగ్ యంత్రాంగాలను ఎనేబుల్ చేస్తుంది. ఉదాహరణకు, ఫేస్‌బుక్ వంటి థర్డ్ పార్టీలు మీరు మా వెబ్‌సైట్‌ను సందర్శించారనే సమాచారాన్ని మీకు లక్షిత ఆన్‌లైన్ ప్రకటనలు పంపించేందుకు వాడుకోవచ్చు. అంతేకాకుండా, మా థర్డ్ పార్టీ ప్రకటనల నెట్‌వర్క్‌లు మీరు మా వెబ్‌సైట్‌ను వాడటానికి సంబంధించిన సమాచారాన్ని ఉపయోగించుకొని మీ సాధారణ ఆన్‌లైన్ యాక్టివిటీ రుజువుగా లక్షిత ప్రకటనలు పంపించడంలో సహాయపడవచ్చు. గోప్యత, విశ్వసనీయతలు సహా ఆసక్తి-ఆధారిత ప్రకటనల పద్ధతుల గురించిన సమాచారం కోసం, నెట్‌వర్క్ అడ్వర్టైజ్‌మెంట్ ప్రోత్సాహక వెబ్‌సైట్ లేదా డిజిటల్ అడ్వర్టైజింగ్ అలయెన్స్ వెబ్‌సైట్ సందర్శించండి.
థర్డ్ పార్టీల ఆన్‌లైన్ ట్రాకింగ్ యంత్రాంగాల వాడకం ఆ థర్డ్ పార్టీల సొంత గోప్యతా విధానాలకు లోబడి జరుగుతాయి తప్ప ఈ గోప్యతా విధానానికి లోబడి కాదు. మీ కంప్యూటర్ లేదా ఇతర పరికరంపై తృతీయపక్షాలు కుకీలను ఏర్పాటు చేయడం లేదా యాక్సెస్ చేసుకోవడాన్ని నిరోధించాలని మీరు ఎంచుకున్నట్లయితే, మీరు కుకీలను బ్లాక్ చేయడానికి మీ బ్రౌజర్‌ని సెటప్ చేయవచ్చు, అదనంగా, మీరు ఇక్కడ నిలిపివేయడాన్ని ఎంచుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు నెట్‌వర్క్ అడ్వర్టైజింగ్ అలయెన్స్ లోపలే కంపెనీల లక్షిత అడ్వర్టైజింగ్ నుంచి తొలగించుకోవచ్చు, లేదా ఇక్కడ నిలిపివేయడాన్ని ఎంచుకోవడం ద్వారా డిజిటల్ అడ్వర్టైజింగ్ అలయెన్స్‌లో పాల్గొంటున్న కంపెనీల లక్షిత ప్రకటనల నుంచి తొలగించుకోవచ్చు. మా వెబ్‌సైట్ ప్రస్తుతం "డు నాట్ ట్రాక్"కు స్పందించనప్పటికీ, ఈ థర్డ్ పార్టీ ప్రోగ్రామ్‌ల ద్వారా, అలాగే పైన వివరించిన ఇతర దశ ద్వారా మీరు ట్రాకింగ్‌ను పరిమితం చేయవచ్చు.
మేం కుకీలను ఎలా ఉపయోగిస్తాం, అలాగే మీరు మీ కుకీ ప్రాధాన్యతల్ని ఎలా సర్దుబాటు చేసుకోవచ్చు అనే దాని గురించి మరింత తెలుసుకోవడానికి మీరు మా కుకీ పాలసీని కూడా సందర్శించవచ్చు.
మీ సమాచార బదిలీ, భద్రపరచడం
Science 37 ప్రధాన కార్యాలయం అమెరికాలోని ఉత్తర కారొలైనా రాష్ట్రం, రాహ్లీలో ఉంది. మీ వ్యక్తిగత సమాచారాన్ని మా కేంద్రాలు ఉన్న లేదా సర్వీస్ ప్రొవైడర్లతో మేం కలిసి పనిచేసే ఏ దేశంలోనైనా నిల్వ చేయవచ్చు. ఈ సేవలను ఉపయోగించటం ద్వారా, మీ సమాచారం అమెరికాతో సహా, మీరు నివసించే దేశానికి, అమెరికాకు వెలుపల ఉన్న దేశాలకు బదిలీ అవుతుందని, అక్కడ మీ దేశానికి భిన్నమైన సమాచార రక్షణ చట్టాలు ఉండవచ్చని మీరు అర్థం చేసుకున్నారు. కొన్ని నిర్ధిష్ట పరిస్థితుల్లో, ఆ ఇతర దేశాల్లోని కోర్టులు, చట్టాన్ని అమలు చేసే సంస్థలు, నియంత్రణా సంస్థలు లేదా భద్రతా అధికారులు మీ వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్ చేసుకునే అధికారాన్ని కలిగి ఉంటారు.
EEA, స్విట్జర్లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్‌లకు సంబంధించిన అదనపు సమాచారం
యూరోపియన్ కమిషన్ గుర్తించిన కొన్ని EEA యేతర దేశాలు, స్విట్జర్లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్ తమ ప్రమాణాల ప్రకారం సమాచార రక్షణను సముచిత స్థాయిలో అందిస్తున్నాయి. (సముచిత రక్షణ అందించే దేశాల పూర్తి జాబితా ఇక్కడ) లభ్యమవుతుంది. ఉదాహరణకు, EEA, స్విట్జర్లాండ్, UKల నుంచి యూరోపియన్ కమిషన్ సముచితమైనవిగా పరిగణించని దేశాలకు బదిలీల కోసం, మేం మీ వ్యక్తిగత సమాచారాన్ని కాపాడటం కోసం యూరోపియన్ కమిషన్ స్వీకరించిన స్టాండర్డ్ కాంట్రాక్చువల్ క్లాజుల వంటి సముచిత చర్యలను నిర్ధారించాం. మీరు ఈ కింద ఇచ్చిన “మమ్మల్ని సంప్రదించడం ఎలా” అనే సెక్షన్‌లో పేర్కొన్న విధంగా మమ్మల్ని సంప్రదించి ఈ చర్యలకు సంబంధించిన కాపీని పొందవచ్చు.
మీ వ్యక్తిగత సమాచారం బదిలీ లేదా భద్రపరచడం గురించి మీకు ఏవైనా గోప్యతా సంబంధిత ప్రశ్నలు ఉన్నట్లయితే, దయచేసి Privacy@Science37.com మమ్మల్ని సంప్రదించండి
డేటాను ఉంచిపెట్టడం
ఈ గోప్యతా విధానంలో పేర్కొన్న విధంగా, అలాగే/లేదా వర్తించే చట్టానికి అనుగుణంగా మీ వ్యక్తిగత సమాచారాన్ని దాన్ని ఏ ప్రయోజనం(నాల) కోసం సేకరించామో, దాని ప్రకారం అవసరమైనంత కాలం పాటు మా దగ్గర నిల్వ చేస్తాం.
మా నిల్వచేసే వ్యవధులను నిర్ధారించేందుకు ఉపయోగించే ప్రమాణాలు:
భద్రత
మీరు మాతో పంచుకునే వ్యక్తిగత సమాచారాన్ని కాపాడటానికి Science 37 కట్టుబడి ఉంది.
మీ వ్యక్తిగత సమాచారాన్ని అనధికారికంగా యాక్సెస్ చేయకుండా, వాడకుండా లేదా వెల్లడించకుండా కాపాడేందుకు మేం తగిన సెక్యూరిటీ టెక్నాలజీలను, ప్రక్రియలను, సంస్థాగత చర్యలను జమిలిగా వాడాలని కోరుకుంటున్నాం. దురదృష్టవశాత్తు, డేటా ప్రసారం, భద్రపరిచే వ్యవస్థలు 100 శాతం సురక్షితమైనవని చెప్పలేం. మాతో మీ ఇంటరాక్షన్ సురక్షితం కాదని నమ్మేందుకు మీకు ఏదైనా కారణం కనిపిస్తే, దయచేసి ఈ కింద ఇచ్చిన “మమ్మల్ని సంప్రదించడ ఎలా” అనే సెక్షన్‌లో సూచించిన విధంగా మాకు తక్షణమే సమాచారం అందజేయండి.
సున్నితమైన సమాచారం
మేం అభ్యర్థించినప్పుడు తప్ప, మీరు ఎన్నడూ, ఏదైనా సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని (ఉదాహరణకు, సోషల్ సెక్యూరిటీ నంబర్లు, జాతి లేదా జాతిపరమైన మూలాలకు సంబంధించిన సమాచారం, రాజకీయ అభిప్రాయాలు, మతం లేదా ఇతర విశ్వాసాలు, ఆరోగ్యం, బయోమెట్రిక్స్ లేదా జెనెటిక్ లక్షణాలు, నేర చరిత్ర, లేదా ట్రేడ్ యూనియన్ సభ్యత్వం వంటివి) మా సేవల ద్వారానైనా, లేదా మరేదైనా పద్ధతిలోనైనా సరే మాకు పంపించవద్దని లేదా వెల్లడించవద్దని మేం కోరుతున్నాం.
పిల్లలు
Science 37 సేవలు పద్దెనిమిది (18) ఏళ్ల లోపు వ్యక్తుల కోసం ఉద్దేశించినవి కావు. వర్తించే చట్టం ప్రకారం అవసరమైనట్లయితే, 16 ఏళ్ల లోపు వ్యక్తుల వ్యక్తిగత సమాచారాన్ని మైనర్ యొక్క తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకుల నుంచి ఆమోదాన్ని కోరకుండా, పొందకుండా మేం తెలిసి ఎన్నటికీ సేకరించం.
డైరెక్ట్ మార్కెటింగ్ విషయంలో మీ ఎంపికలు
మార్కెటింగ్ ప్రయోజనాల కోసం సహా మీ వ్యక్తిగత సమాచారాన్ని మేం ఉపయోగించడం, వెల్లడించడానికి సంబంధించి మేం మీకు ఎంపికలను ఇస్తాం.
మీరు భవిష్యత్తులో మా నుంచి ఈమెయిల్స్ పొందకూడదని కోరుకుంటే, "అన్‌సబ్‌స్క్రైబ్" బటన్ క్లిక్ చేయడం ద్వారా లేదా Privacy@Science37.comని సంప్రదించడం ద్వారా ఎప్పుడైనా అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు.
Science 37 పాక్షిక నిలిపివేత అవకాశాన్ని కూడా ఇస్తుంది. ఈ ఆప్షన్ ద్వారా మీరు ఏయే డేటా ఎలిమెంట్లను అందించాలని అనుకుంటున్నారు, ఏవేవి అందించరాదని అనేది ఎంచుకునే వీలుంటుంది. నిర్ధిష్ట డేటా ఎలిమెంట్లను అందించడాన్ని నిలిపివేయడం గురించి మరింత సమాచారం కొరకు Privacy@Science37.comని సంప్రదించండి.
థర్డ్ పార్టీల మార్కెటింగ్ ప్రయోజనాల కోసం మీ సమ్మతి లేకుండా వ్యక్తిగత సమాచారాన్ని Science 37 వారితో పంచుకోదు.
వర్తించే చట్టానికి ఆచరణాత్మకంగా కట్టుబడి ఉండే విధంగా మీ నుంచి వచ్చే అభ్యర్థన(ల)ను వీలైనంత త్వరగా నెరవేర్చేందుకు Science 37 ప్రయత్నిస్తుంది. ఒకవేళ మార్కెటింగ్ సంబంధిత ఈమెయిల్స్ మా నుంచి రాకుండా మీరు నిలిపివేసినప్పటికీ, మీకు ముఖ్యమైన అడ్మినిస్ట్రేటివ్ సందేశాలు మేం పంపిస్తూనే ఉంటామని దయచేసి గమనించండి. వాటిని మీరు నిలిపివేయలేరు.
మీ హక్కులు
మీరు మీ వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్ చేసేందుకు, సవరించేందుకు, అప్‌డేట్ చేసేందుకు, లేదా డిలీట్ చేసేందుకు అభ్యర్థించాలనుకుంటే, వ్యక్తిగత సమాచారాన్ని ప్రాసెస్ చేయటంపైన అభ్యంతరం ఉంటే లేదా నిలిపివేయాలని కోరుకుంటే లేదా మీరు మరేదైనా కంపెనీకి (వర్తించే చట్టం ప్రకారం మీకు లభించే హక్కులకు లోబడి మాత్రమే) అందజేసే ఉద్దేశంతో మీ వ్యక్తిగత సమాచారం కాపీ కావాలని అభ్యర్థించాలనుకుంటే, దయచేసి ఈ గోప్యతా విధానం చివరలో పేర్కొన్న సంప్రదించు సమాచారాన్ని ఉపయోగించి మమ్మల్ని సంప్రదించండి. వర్తించే చట్టానికి అనుగుణంగా మేం మీ అభ్యర్థనకు స్పందిస్తాం. మీరు కాలిఫోర్నియా నివాసితుడు అయితే, CCPA కింద మీరు చేయగల అభ్యర్థనల విషయంలో మరింత సమాచారం కోసం, దయచేసి ఈ గోప్యతా విధానం చివరలో ఇచ్చిన "కాలిఫోర్నియాకు సంబంధించి అదనపు సమాచారం" చూడండి.
మీ అభ్యర్థనలో, మీరు ఏ వ్యక్తిగత సమాచారాన్ని మార్చాలని కోరుకుంటున్నారు లేదా మీ వ్యక్తిగత సమాచారాన్ని మా డేటాబేస్‌లోలో లేకుండా తొలగించాలని కోరుకుంటున్నారా అనే విషయాన్ని దయచేసి స్పష్టంగా తెలపండి. మీ రక్షణ కోసం, మాకు మీ అభ్యర్థనను పంపించేందుకు మీరు వాడే నిర్దిష్టమైన ఈమెయిల్‌తో ముడిపడిన వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన అభ్యర్థనలను మాత్రమే మేం అమలు చేయగలం. అలాగే, మీ అభ్యర్థనను అమలు చేయడానికి ముందు మేం మీ గుర్తింపును ధృవీకరించుకోవాల్సిన అవసరం కూడా ఉండొచ్చు. ఆచరణలో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మేం మీ అభ్యర్థనను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాం.
రికార్డ్ కీపింగ్ ఉద్దేశాల కోసం మేం నిర్ధిష్ట సమాచారాన్ని భద్రపరచవచ్చు అనే విషయాన్ని దయచేసి గమనించండి.
మీరు ఏదైనా వైద్య అధ్యయనం నుంచి ఉపసంహరించుకుంటే లేదా ఉపసంహరిస్తే, సేవల నుంచి మేం ఎలాంటి కొత్త సమాచారాన్ని సేకరించం లేదా పొందం. అయితే, మీ ఉపసంహరణ అభ్యర్థన మాకు అందే లోపు, మేం సేకరించిన, ప్రాసెస్ చేసిన, మరియు భద్రపరిచిన సమాచారాన్ని మేం డిలీట్ చేయలేకపోవచ్చు. దాన్ని వైద్య అధ్యయనాల ఉద్దేశాల కోసం, నియంత్రణా అవసరాలకు అనుగుణంగా - వర్తించే చట్టాలు దానికి భిన్నంగా నిర్దేశిస్తే తప్ప - ఉపయోగిస్తూనే ఉండొచ్చు.
బాహ్య లేదా థర్డ్ పార్టీ లింక్స్
ఈ వెబ్‌సైట్‌లో థర్డ్ పార్టీ లింక్స్ ఉండొచ్చు. ఈ లింక్స్ మీరు ఉపయోగించినట్టయితే, మీరు ఈ వెబ్‌సైట్ నుంచి బయటకు వెళ్లిపోతారు. ఇక థర్డ్ పార్టీల ప్రైవసీ, సమాచారం, ఇతర పద్ధతులకు సంబంధించి, అలాగే సర్వీసులతో లింక్ అయిన ఏదైనా వెబ్‌సైట్ లేదా సేవకు సంబంధించి ఈ గోప్యతా విధానం బాధ్యత వహించదు, వాటిని పరిష్కరించదు. సర్వీసుల్లో లింక్‌ను చేర్చడం వల్ల అది లింక్ చేసే సైట్ లేదా సేవకు మా అంగీకారం ఉన్నట్టు కాదు.
అంతేకాదు, మా సోషల్ మీడియా పేజీల ద్వారా లేదా వాటి సంబంధంలో మీరు ఇతర సంస్థలకు వెల్లడి చేసే వ్యక్తిగత సమాచారంతో సహా ఫేస్‌బుక్, యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఆర్ఐఎం, లేదా మరే ఇతర యాప్ డెవలపర్, యాప్ ప్రొవైడర్, సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ప్రొవైడర్, ఆపరేటింగ్ సిస్టమ్ ప్రొవైడర్, వైర్‌లెస్ సర్వీస్ ప్రొవైడర్, లేదా పరికరం తయారీదారుడు వంటి ఇతర సంస్థలు చేసే సమాచార సేకరణ, వాడకం, వెల్లడి, లేదా భద్రతా విధానాలు లేదా పద్ధతులకు మేం బాధ్యులం కాదు. మా వెబ్‌సైట్లో లిస్ట్ అయిన థర్డ్ పార్టీ సైట్స్ ఏవైనా యాక్సెస్ చేసుకోవాలని మీరు నిర్ణయించుకుంటే, మీరు మీ స్వంత రిస్క్‌తో చేస్తారు.
గోప్యతా విధానానికి మార్పులు
భవిష్యత్తులో మేం ఈ వెబ్‌సైట్లో మార్పులు చేయొచ్చు. దాని ఫలితంగా, ఆ మార్పులు ప్రతిఫలించేలా ఈ గోప్యతా విధానాన్ని సవరించాల్సి రావచ్చు. ఈ అలాంటి మార్పులన్నింటినీ మేం మా వెబ్‌సైట్లో ప్రచురిస్తాం. కాబట్టి ఈ పేజీని మీరు తరచూ సమీక్షిస్తూ ఉండాలి. సేవలకు సంబంధించి సవరించిన గోప్యతా విధానాన్ని మా వెబ్‌సైట్‌లో ప్రచురించినప్పుడే జరిగిన మార్పులేవైనా అమలులోకి వస్తాయి.
మమ్మల్ని ఎలా సంప్రదించాలి
Science 37 గ్లోబల్ గోప్యతా విధానానికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు లేదా వ్యాఖ్యలు ఉన్నట్టయితే, దయచేసి మమ్మల్ని సంప్రదించండి Privacy@Science37.com. మీరు మా డేటా ప్రొటెక్షన్ అధికారిని కూడా ఇక్కడ సంప్రదించవచ్చు
Science 37, Inc.
అటెన్షన్: డీపీఓ
3005 Carrington Mill Blvd, Suite #500
Morrisville NC 2756
EEA, UKకు సంబంధించిన అదనపు సమాచారం
Science 37 అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉంది. వ్యక్తిగత సమాచారాన్ని EEA, UK నుంచి అమెరికాకు బదిలీ చేయడం కోసం Science 37 EEA, UK ఆమోదించిన ప్రామాణిక ఒప్పంద నియమాలకు, ఇతర ఆమోదిత మెకానిజాలకు కట్టుబడి ఉంటుంది, వాటిని వినియోగించుకుంటుంది.
మీరు ఇది కూడా చేయవచ్చు
కాలిఫోర్నియాకు సంబంధించిన అదనపు సమాచారం
అనుసరించే కాలిఫోర్నియా వినియోగదారు గోప్యతా చట్టం, 2018 (“CCPA”) ప్రకారం, కాలిపోర్నియా నివాసితుల నుంచి మేం సేకరించే, ఉపయోగించే, వెల్లడి చేసే వ్యక్తిగత సమాచార కేటగరీలకు సంబంధించి మేం ఈ కింద పేర్కొన్న అదనపు వివరాలను అందిస్తున్నాం.
వ్యక్తిగత సమాచారపు సేకరణ, వెల్లడి
ఈ కింది ఛార్టులో ఉండేవి: (1) CCPAలో జాబితా చేసినట్టుగా, గడచిన 12 నెలలలో మేం సేకరించాలని ప్లాన్ చేసుకున్న, అలాగే సేకరించిన, వెల్లడించినన వ్యక్తిగత సమాచార కేటగిరీలు; (2) గడచిన 12 నెలల కాలంలో మా నిర్వహణా వ్యాపార ప్రయోజనాల కోసం మేం థర్డ్ పార్టీలకు వెల్లడించిన వ్యక్తిగత సమాచార కేటగిరీలు.
|
|
|
|
|
|
వ్యక్తిగత సమాచార అమ్మకాలు, వెల్లడి
CCPA ప్రకారం, ఒక వ్యాపారం వ్యక్తిగత సమాచారాన్ని అమ్ముతున్నట్టయితే, అది కాలిఫోర్నియా నివాసులను తమ వ్యక్తిగత సమాచార అమ్మకం నుంచి వైదొలగడానికి విధిగా అనుమతించాలి. మేం వ్యక్తిగత సమాచారాన్ని "విక్రయించం". 16 ఏళ్ల లోపు మైనర్ల వ్యక్తిగత సమాచారాన్ని మేం విక్రయించం. క్రాస్-కాంటెక్స్ట్ ప్రవర్తనాపరమైన అడ్వర్టైజింగ్ ఉద్దేశాల కోసం వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడి చేయడం విషయంలో CCPA నిర్వచించిన విధంగా, మేం వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడి చేయం.
వ్యక్తిగత సమాచార మార్గాలు
మీరు ఈ సర్వీసెస్ ద్వారా మమ్మల్ని సంప్రదించినప్పుడు, అలాగే పైన పేర్కొన్న విధంగా మేం మీ వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తాం.
వ్యక్తిగత సమాచార వాడకం
మీ వ్యక్తిగత సమాచారాన్ని పైన పేర్కొన్న వాటితో సహా మా వ్యాపారాన్ని నడిపేందుకు, నిర్వహించేందుకు, కొనసాగించేందుకు, మా ఉత్పత్తులను, సేవలను అందించేందుకు, మా వ్యాపార ప్రయోజనాలను, లక్ష్యాలను పరిపూర్తి చేసుకునేందుకు మేం వాడుకోగలం.
CCPA హక్కులు, అభ్యర్థనలు
తెలుసుకునేందుకు, డిలీట్ చేసేందుకు అభ్యర్థనలు
కొన్ని పరిమితులు, మినహాయింపులకు లోబడి, కాలిఫోర్నియా నివాసులు ఈ కింది అభ్యర్థనలు చేయొచ్చు:
అభ్యర్థన చేయడానికి, దయచేసి మమ్మల్ని 1-866-888-7580 ద్వారా సంప్రదించండి లేదా పైన పేర్కొన్న “మమ్మల్ని ఎలా సంప్రదించాలి” అనే సెక్షన్ ద్వారా సంప్రదించండి. వర్తించే చట్టం ప్రకారం, మీ అకౌంట్ ఏ రకానిది, అభ్యర్థిస్తున్న వ్యక్తిగత సమాచారం ఎంత సున్నితమైంది అన్న దానిపై ఆధారపడి మేం అభ్యర్థనను వెరిఫై చేసి, స్పందిస్తాం. మీ గుర్తింపును వెరిఫై చేసుకునేందుకు, అలాగే మోసపు అభ్యర్థనలను నివారించేందుకు మీ పేరు, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నంబర్ వంటి అదనపు వ్యక్తిగత సమాచారం కోసం మేం మిమ్మల్ని అభ్యర్థించాల్సి రావచ్చు. 13 ఏళ్ల లోపు చిన్నారుల విషయంలో, మీరు ఆ చిన్నారి తల్లిదండ్రులైనా లేదా చట్టపరమైన సంరక్షులైనా, వారి తరఫున అభ్యర్థించవచ్చు. మీరు డిలీట్ చేయాలని అభ్యర్థించినట్టయితే, మీ వ్యక్తిగత సమాచారాన్ని డిలీట్ చేయడానికి ముందు మేం మిమ్మల్ని ధృవీకరణ కోసం అడుగుతాం.
కాలిఫోర్నియా నివాసితుడి తరఫున ఒక అధికారిక ఏజెంటుగా మీరు తెలుసుకోవడం కోసం లేదా డిలీట్ చేయడం కోసం అభ్యర్ధించాలని అనుకుంటే, పైన పేర్కొన్న విధంగా మీరు సబ్మిషన్ పద్ధతుల్ని వాడుకోవచ్చు. మా ధృవీకరణ ప్రక్రియలో భాగంగా, మీరు మాకు అధికారిక ఏజెంటు హోదాకు సంబంధించిన రుజువు చూపించమని అడగవచ్చు. అందులో ఇవి ఉండవచ్చు:
1. కాలిఫోర్నియాలో వ్యాపార నిర్వహణ కోసం కాలిఫోర్నియా సెక్రటరీ ఆఫ్ స్టేట్‌లో రిజిస్ట్రేషన్ రుజువు;
2. ప్రొబేట్ కోడ్ సెక్షన్స్ 4121-4130 ప్రకారం, కోరుకుంటున్న నివాసితుడు నుంచి మీకు లభించిన పవర్ ఆఫ్ అటార్నీ రుజువు.
కాలిఫోర్నియా నివాసితుడు తరఫున మీరు అధికారిక ఏజెంట్ అయి ఉండి, ప్రొబేట్ కోడ్ సెక్షన్స్ 4121-4130 ప్రకారం పవర్ ఆఫ్ అటార్నీ పొందనట్టయితే, సదరు నివాసితుడుని మేం ఇవి కూడా కోరగలం:
1. నివాసితుడు తన సొంత గుర్తింపును నేరుగా మాతో వెరిఫై చేసుకోవాలి; లేదా
2. నివాసితుడు అభ్యర్థన చేసేందుకు మీకు అనుమతిని ఇచ్చినట్టు మీరు నేరుగా మాతో ధృవీకరించాలి.
సున్నితమైన వ్యక్తిగత సమాచారం వినియోగాన్ని, వెల్లడిని పరిమితం చేసే హక్కు
CCPA అధికారికంగా ఆమోదించిన ప్రయోజనాలకు వెలుపల సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని Science 37 ఉపయోగించదు లేదా వెల్లడి చేయదు.
డేటా రిటెన్షన్ సెక్షన్
ఈ పాలసీలో పేర్కొన్న ప్రయోజనాల రీత్యా సహేతుకంగా అవసరమైన మేరకు, లేదా సేకరణ సమయంలో మీకు వెల్లడి చేసిన మేరకు, లేదా మీరు అధికారికంగా ఆమోదించిన మేరకు, లేదా చట్టప్రకారం అవసరమైన మేరకు మాత్రమే మేం సేకరించిన వ్యక్తిగత సమాచారాన్ని Science 37 తన వద్ద ఉంచుకుంటుంది.
వివక్షకు గురికాకుండా ఉండే హక్కు
CCPA ప్రకారం మీ హక్కులను అనుభవించడం కోసం, మీరు చట్టవిరుద్ధమైన వివక్షపూరిత ప్రవర్తనకు గురికాకుండా ఉండే హక్కును కలిగి ఉంటారు.